Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి అభివృద్ధి పట్టదు.. లవ్ జిహాద్ వంటి సున్నితమైన అంశాలనే కోరుకుంటుంది - కర్ణాటక ప్రతిపక్షనేత హరిప్రసాద్

బీజేపీకి అభివృద్ధి అంటే పట్టింపు లేదని, ఆ పార్టీ లవ్ జీహాద్, హిందూ-ముస్లిం వంటి ఇతర సున్నితమైన అంశాలనే కోరుకుంటుందని అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ ఆరోపించారు. తాము చదువు గురించి మాట్లాడితే, వాళ్లు కత్తులు, తుపాకుల గురించి మాట్లాడుతారని అన్నారు. 

BJP will not develop.. It wants sensitive issues like love jihad - Karnataka opposition leader Hariprasad
Author
First Published Jan 20, 2023, 4:59 PM IST

బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అభివృద్ధికి బదులు ‘లవ్ జిహాద్’ ఇతర సున్నితమైన అంశాలను మాత్రమే కోరుకుంటుందని అన్నారు. “బీజేపీ అభివృద్దిని పక్కనబెట్టి కేవలం లవ్ జిహాద్, హిందూ-ముస్లిం వివాదాలు, ఇతర సున్నితమైన అంశాలని కోరుకుంటుంది. బెంగుళూరు, షాంఘై విద్యార్థులతో పోటీపడేంత సామర్థ్యం ఉండాలని అక్కడి విద్యార్థులకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చెబుతుండేవారు. ఇప్పుడు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దానిని నాశనం చేసింది.’’ అని ఆయన ఆరోపించారు.

ఇక నుంచి సినిమాలకు మత సెన్సార్ బోర్డు కూడా.. హిందూ దేవుళ్లని అవమానించే చిత్రాలను పర్యవేక్షించడానికే!

“మేము చదువు గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు కత్తులు, తుపాకుల గురించి మాట్లాడతారు. విద్య ముఖ్యం. కానీ ఎక్కడా ఉపయోగించలేని జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి జేడీఎస్‌పై దాడి చేసి అమూల్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) విలీనం గురించి మాట్లాడితే మేము దానిని అనుమతించబోము’’ అని హరిప్రసాద్ అన్నారు.

కాగా.. ఇటీవల బీకే హరిప్రసాద్ బీజేపీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ తదితరులను ఆయన వేశ్యలుగా పోల్చారు. స్పష్టమైన ప్రజాతీర్పు లేనప్పుడు తాము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ‘‘ఆహారం కోసం శరీరాన్ని అమ్ముకునే స్త్రీని వేశ్య అంటారు. తమను తాము అమ్ముకున్న ఎమ్మెల్యేలను మీరు ఏమని పిలుస్తారో మీకే వదిలేస్తున్నాను’’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆయనపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ బీజేపీని కౌంటర్ చేస్తూ తాజాగా మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios