Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన ప్రకటన..

కాంగ్రెస్‌, జేడీఎస్‌లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 

Bjp Will Fight Karnataka Assembly Elections Alone And Form Govt Next Year Says Amit Shah
Author
First Published Jan 1, 2023, 1:21 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్, జేడీఎస్‌లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమతో పొత్తు పెట్టుకుంటుందని జెడిఎస్ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తాను స్పష్టం చేయాలనుకుంటున్నాననీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. బెంగళూరులో శనివారం జరిగిన బూత్ ప్రెసిడెంట్లు, బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.  

వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులోభాగంగా బూత్ ప్రెసిడెంట్లు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని పీఎఫ్‌ఐ మద్దతుదారుగా పేర్కొంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.
 
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేంద్ర హోంమంత్రి.. కాంగ్రెస్‌కు అధికారం దక్కించుకోవడమంటే అవినీతి చేయడమేనని, ఆ పార్టీ ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని అన్నారు.   చేయడమేనని అన్నారు. ఇటీవల జరిగిన 7 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాల్లో విజయం సాధించిందన్నారు. కాగా 6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు.  

కాంగ్రెస్-జేడీఎస్ అవినీతి పార్టీలు 

శుక్రవారం మాండ్యాలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు అవినీతి పార్టీలని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల ప్రభుత్వాన్ని చూశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక ఢిల్లీ ఏటీఎంగా, జేడీఎస్ వచ్చాక ఓ కుటుంబానికి చెందిన ఏటీఎంగా మారుతుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు అవినీతితో కర్ణాటక ప్రగతిని పదే పదే అడ్డుకున్నాయని ఆరోపించారు. 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కొత్త విషయాలను తెరపైకి తెస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్‌కు అధికారమే అవినీతి సాధనం అని అమిత్ షా  అన్నారు. అయితే మనకు అధికారం అనేది సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆనందాన్ని అందించే సాధనం. 2022లో ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ఏడు రాష్ట్రాల్లో ఐదింటిలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది.

మరోవైపు ఏడు రాష్ట్రాల్లో ఆరింటిలో కాంగ్రెస్ స్వీప్ క్లియర్ అయిందని గుర్తు చేశారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ (తుక్డే తుక్డే గ్యాంగ్) మధ్య పోరు సాగుతున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అదే సమయంలో ఇక్కడ మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. జేడీఎస్ మాత్రం మాతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. 

కాంగ్రెస్ ఫైర్  

కాంగ్రెస్ ను అవినీతి పార్టీ అని అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా  విమర్శిస్తూ..  కళంకిత వ్యక్తులను రాష్ట్ర బీజేపీలోకి చేర్చుకున్న "రాజకీయ డీలర్" అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభివర్ణించారు. అవినీతి గురించి మాట్లాడుతున్నప్పటికీ రిక్రూట్‌మెంట్, బదిలీలు, పదోన్నతులు, గ్రాంట్ల కేటాయింపు, పనుల అమలు, బిల్లుల చెల్లింపుల్లో 40 శాతం కమీషన్‌ పైగా కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలపై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios