Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్‌లో మమత వర్సెస్ బీజేపీ..!

బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దీంతో బెంగాల్ రాజకీయం హీటెక్కుతోంది. 

bjp vs tmc in west bengal over jp nadda tour - bsb
Author
Hyderabad, First Published Dec 10, 2020, 11:20 AM IST

బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దీంతో బెంగాల్ రాజకీయం హీటెక్కుతోంది. 

వచ్చే ఏడాది బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి.. కానీ, ఇప్పటి నుంచే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య వాడీవేడీ మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మమత సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

బెంగాల్ లో మమత అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పబోతున్నారని నడ్డా విమర్శించారు. సౌత్‌ నార్త్‌ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరవేశామని, బెంగాల్‌లో కూడా తామే అధికారంలోకి రాబోతున్నామన్నారు జేపీ నడ్డా.

దీంతో బీజేపీపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఫైర్ అయ్యారు. డబ్బులు వెదజల్లి తమ ప్రభుత్వాన్నివిచ్ఛిన్నం చేసే కుట్రకు  బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ చేసే కుట్రలను తమ రాష్ట్రంలో సాగనివ్వబోమని  స్పష్టం చేశారు మమత. 

అంతేకాదు అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని విమర్శించారు. మొత్తానికి బెంగాల్‌లో బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇది ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios