ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు ఈ లిస్ట్‌లో ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మ ప్రకటించగా.. వయో భారంతో మహాజన్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు సుమిత్ర ప్రకటించారని....  దీనిలో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులకు ఆమె విందును సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

తనకు ఎంపీగా, తొలి మహిళా లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం కల్పించినందుకు బీజేపీ అధిష్టానికి సుమిత్ర ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ సైతం చేశారు. కాగా.. తమకు పార్లమెంట్ మాజీ సభ్యులు గల గుర్తింపు కార్డులను మంజూరు చేయాలంటూ.. ఈ ఇద్దరు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ... సుమిత్ర, సుష్మ దరఖాస్తు చేసుకున్నారు.