నవయుగ రావణ్ రాహుల్.. భారతదేశాన్ని నాశనం చేయడమే లక్ష్యం: బీజేపీ పోస్టు వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. రాహుల్ గాంధీని కొత్త యుగపు ‘‘రావణుడు’’ అని పేర్కొంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. రాహుల్ గాంధీని నవయుగపు ‘‘రావణుడు’’ అని పేర్కొంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో రాహుల్‌ను రావణుడి మాదిరిగా చూపించారు. రాహుల్‌కు ఏడు తలలు ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ పోస్టర్‌ను షేర్ చేసిన బీజేపీ.. భారతదేశాన్ని నాశనం చేయడమే అతని లక్ష్యం అంటూ రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
‘‘నవయుగ రావణుడు ఇక్కడ ఉన్నాడు. అతను దుర్మార్గుడు. ధర్మ వ్యతిరేకుడు. యాంటీ రామ్. భారత్‌ను నాశనం చేయడమే అతని లక్ష్యం’’ అని ఆ పోస్టులో బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా.. ‘‘భారతదేశం ప్రమాదంలో ఉంది.. రావణ్.. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్.. జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారు’’ అని బీజేపీ షేర్ చేసిన పోస్టర్‌పై రాసి ఉంది.
రాహుల్‌ను సోరోస్‌తో బీజేపీ ఎందుకు ముడిపెట్టింది?
జార్జ్ సోరోస్ హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు.. దేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా జార్జ్ సోరోస్ వ్యక్తులు పాల్గొన్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఏడాది జూన్‌లో రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో జార్జ్ సోరోస్ నుంచి నిధులు పొందుతున్న వ్యక్తులను కలుసుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. రాహుల్ తన అమెరికా పర్యటనలో జార్జ్ సోరోస్‌తో సంబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను కలిశారా లేదా అని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరింది.