హెలికాప్టర్‌లో కేదార్ నాథ్ కు రాహుల్: విమర్శలు చేసిన బీజేపీ
కేదార్ నాథ్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన రాహుల్ గాంధీ నిన్న కేదార్ నాథ్ కు చేరుకున్నారు. మూడు రోజులు ఇక్కడే ఉంటారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేదార్ నాథ్ లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. కేదార్ నాథ్ లో రాహుల్ గాంధీ పూజలు చేశారు. కేదార్ నాథ్ కు వచ్చిన భక్తులకు రాహుల్ గాంధీ టీ, ప్రసాదం అందించారు.కేదార్ నాథ్ కు రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో చేరుకోవడంపై బీజేపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించింది.
కేదార్ నాథ్ కు హెలికాప్టర్ లో వెళ్లడంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బీజేపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. గతంలో రాహుల్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో కేదార్ నాథ్ కు చేరుకున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2022 నవంబర్ 10న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కేదార్ నాథ్ యాత్రను వంచనగా బీజేపీ పేర్కొంది.కేదార్ నాథ్ కు చేరుకున్న రాహుల్ గాంధీని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొందరు భక్తులు రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకున్నారు. గతంలో కూడ రాహుల్ గాంధీ పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భక్తులకు సేవలు చేశారు. స్వర్ణ దేవాలయంలో టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు కడిగారు. స్వర్ణ దేవాలయంలో సేవ చేసేందుకు వచ్చినందున పార్టీ శ్రేణులు ఎవరూ కూడ ఆయనను కలిసేందుకు వెళ్లొద్దని అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వం సూచించింది.