ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. గోవా,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని సర్వే సంస్థలు ప్రకటించాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని సర్వే ఫలితాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మణిఫూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో BJP అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే Goa, Uttarakhand రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉందని Exit polls సర్వే ఫలితాలు తెలిపాయి. అయితే కొన్ని సర్వే సంస్థలు మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉందని కూడా ప్రకటించాయి. ఇక పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
Manipur లో బీజేపీకి 23 -25 అసెంబ్లీ స్థానాలు దక్కనున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. Congress పార్టీకి 10-14 స్థానాలే దక్కుతాయని సర్వే సంస్థలు చెప్పాయి.
Uttar Pradesh రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంటుందని సర్వే నివేదికలు వెల్లడించాయి. కానీ Samajwadi partyపార్టీ మాత్రం విజయానికి అందనంత దూరంలోనే ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్, BSP లు మాత్రం నామ మాత్రంగానే సీట్లను సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.
ఇక Goa లో కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని సర్వే సంస్థలు తెలిపాయి. అయితే కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి స్వల్పంగా ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. మరికొన్ని సంస్థల సర్వేల్లో కాంగ్రెస్ కు స్వల్పంగా అధికంగా సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు తెలిపాయి.
మరో వైపు Uttarakhand లో కూడా ఇదే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఉత్తరాఖండ్ రాాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. కొన్ని సర్వే ఫలితాలు బీజేపీకి స్వల్పంగా ఆధిక్యతను ఇచ్చాయి. కొన్ని సంస్థల సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం లభించింది.
