Asianet News TeluguAsianet News Telugu

Ram Mandhir: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం.. రామ మందిరానికి ప్రాధాన్యత

బీజేపీ లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నది. ఇందులో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అగ్రతాంబూలం వేస్తున్నది. బీజేపీ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించారు.
 

bjp strategy for lok sabha elections, ram temple key weapon kms
Author
First Published Dec 25, 2023, 3:27 AM IST

Ram Mandhir: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతున్నది. ఇప్పటికే మూడు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నెగ్గిన కమల దళం లోక్ సభ ఎన్నికల కోసం మరిన్ని అస్త్ర శస్త్రాలను సానబడుతున్నది. ఇందులో ప్రధానంగా అయోధ్య రామ మందిరం ఉన్నది. ఇప్పటికే 50 శాత ఓటు షేర్ రాబట్టాలని ప్రధానమంత్రి బీజేపీ నేతలకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. అలాగే, గెలుపు మెజార్టీని పెంచుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ద్వారా కూడా ఓట్లు రాబట్టుకునే వ్యూహం చేయాలని ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

ఇందుకు సంబంధించి బీజేపీ కార్యాలయంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. ఈ భేటీల్లోనే ఇందుకు సంబంధించి ముఖ్యమైన సూచనలు వెళ్లినట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఈ సమావేశాల్లో ఉన్నారు. ఈ సమావేశాల్లో వీరే బలమైన సందేశాలను నేతలకు ఇచ్చారు.

ఎన్నికల క్యాంపెయిన్‌లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి గల మత, సాంస్కృతిక ప్రాధాన్యతను ఆధారం చేసుకుని మాట్లాడాలని బీజేపీ సూచనలు చేసింది. రామ మందిర ఉద్యమంలో బీజేపీ పాత్రను ప్రధానం చేస్తూ బుక్ లెట్ తేవాలి. కొత్త ఓటర్లను బూత్ స్థాయిలో ఆకట్టుకుని దియా లైటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఈ సమావేశాల్లో బీజేపీ నేతలు నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read : Christmas: క్రీస్తు పుట్టిన బెత్లేహం లో క్రిస్మస్ వేడుకల్లేవ్ !.. ఎందుకంటే ?

అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో రామ మందిర నిర్మాణాన్ని జాప్యం చేయడానికి ప్రతిపక్షం ఎలా ప్రయత్నాలు చేసిందో కూడా హైలైట్ చేయాలని బీజేపీ భావిస్తున్నది.

రామ మందిరానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడమే కాదు.. అందులో పాల్గొంటుంది కూడా అని అగ్రనేతలు సూచనలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios