Christmas: క్రీస్తు పుట్టిన బెత్లేహంలో క్రిస్మస్ వేడుకల్లేవ్!.. ఎందుకంటే?
జీసస్ క్రీస్తు పుట్టిన బెత్లేహం నగరంలో ఈ సారి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం.. ఇప్పట్లో గాజాను దిలిపెట్టేలా లేదు. ఈ సందర్భంలోనే వెస్ట్ బ్యాంక్ సిటీలోని బెత్లేహం నగరంలో క్రిస్మస్ వేడుకలు ఉండటం లేదని వాళ్లు చెబుతున్నారు.
Christmas: డిసెంబర్ 25వ తేదీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ వేడుకలు కనిపిస్తాయి. అయితే, క్రైస్తవులు పవిత్రంగా భావించే బెత్లేహం వేడుకలు మరింత ఆధ్యాత్మిక చింతనతో జరుగుతాయి. ఎందుకంటే జీసస్ క్రీస్తు బెత్లేహంలో జన్మించాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. కానీ, ఈ ఏడాది బెత్లేహంలో క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా భీకర యుద్ధం జరుపుతున్న తరుణంలో బెత్లేహంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం లేదు.
ఈ సారి బెత్లేహంలో క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. ప్రతి యేటా ఇక్కడ సంబురాలు కనిపించేవి. కానీ, ఈ సారి చాలా తక్కువ మంది విశ్వాసులు ఉండే అవకాశం ఉన్నది. ఒక్క క్రిస్మస్ ట్రీ కూడా ఏర్పాటు చేయకుండా.. ఈ సారి తోటి గాజా పౌరులకు సంఘీభావంగా ఈ విషాద సమయంలో క్రిస్మస్ జరుపుకోవడం లేదని చర్చి లీడర్లు ప్రకటించారు.
Also Read: ఉపరాష్ట్రపతిని మళ్లీ వెక్కిరించిన టీఎంసీ ఎంపీ.. ‘ఇంకా వెయ్యిసార్లు చేస్తా’
ఈ సమయంలో గాజాలోని పౌరుల కోసం మా హృదయం తపిస్తున్నది. ముఖ్యంగా గాజాలో క్రైస్తవుల దుర్గతికి చింతిస్తున్నామని వారు చెప్పారు. కేవలం కాల్పుల విరమణే కాదు, బందీలనూ వదిలిపెట్టాలని తాము కోరుకుంటున్నామని వివిరంచారు. కాగా, గాజాలోని క్యాథలిక్ చర్చికి చెందిన సిస్టర్ నబీలా సలాహ్ మాట్లాడుతూ.. ఈ సారి క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయని వివరిస్తారు. ఒక వైపు బాంబులు, బుల్లెట్ల సప్పుడు వస్తుంటే మరో వైపు తాము ఎలా పండుగ చేసుకోగలం అని వివరించారు.