పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో రైతులు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే.. ఎక్కడైతే రైతులు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారో.. అక్కడే.. ఇప్పుడు బీజేపీ దూసుకుపోతుండటం గమనార్హం. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కుంచుకునేందుకు సర్వత్రా ప్రయత్నిస్తోంది. ఈ రోజు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలౌతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. వీటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. 

ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో.. బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో రైతులు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే.. ఎక్కడైతే రైతులు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారో.. అక్కడే.. ఇప్పుడు బీజేపీ దూసుకుపోతుండటం గమనార్హం. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో బీజేపీ ముందు వరసలో ఉంది.

403 అసెంబ్లీ, 80 లోక్‌సభ స్థానాలు యూపీ సొంతం. అందుకే ఈ రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే యూపీలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి దేశం మొత్తం ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ రాష్ట్రంలో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది కేవలం 47 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017లో ఏకంగా 312 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను సీఏం పీఠంపై కూర్చొబెట్టింది. 

అటు అంతకుముందు అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) 224 స్థానాల నుంచి కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ) కూడా 80 స్థానాల నుంచి 19 స్థానాలకు పడిపోయింది. రెండేళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 62 స్థానాలు కైవసం చేసుకుని తనకు తిరిగేలేదని మరోసారి నిరూపించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా వ్యూహం బాగా పని చేయడంతో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ప్రస్తుత రిజల్ట్స్ ని చూస్తుంటే.. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.