అసోంలోని గువహతి మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగింది. మొత్తం 60 వార్డులకు ఎన్నికలు జరగ్గా 58 స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షం గెలుచుకుంది. జేఎంసీ ఎన్నికల్లో అధికారంలోని బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం బోణి కూడా తెరవలేదు.
గువహతి: బీజేపీ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. ఎన్నికల్లో దాని విజయపరంపరను కంటిన్యూ చేస్తున్నది. అసోంలోని గువహతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ కొట్టింది. జీఎంసీలో జరిగిన 60 వార్డుల ఎన్నికల్లో 58 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని, అసోం జాతీయ పరిషద్ ఒక స్థానాన్ని గెలుపొందాయి.
అసోం స్టేట్ ఎన్నికల కమిషన్ ట్రెండ్స్, ఫలితాల ప్రకారం, బీజేపీ 52 స్థానాలను గెలుచుకుంది. దాని మిత్రపక్ష అసోం గణ పరిషద్ ఆరు వార్డుల్లో గెలుపొందింది. ఇందులో మూడు స్థానాల్లోను బీజేపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. కాగా, ఆప్ అభ్యర్థి మాసుమ బేగం 42వ వార్డును గెలుచుకున్నారు. ఏజేపీ నామినీ హుకుమ్ చాంద్ అలీ ఒకటో నెంబర్ వార్డులో గెలుపొందారు.
గువహతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ జరిగాయి. 2013లో జరిగిన ఎన్నికల్ల కాంగ్రెస్ జీఎంసీ గెలుచుకుంది. కానీ, కౌన్సిలర్ల మధ్య దీర్ఘకాలం జరిగిన ఘర్షణలతో వారంతా బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ గువహతి మున్సిపల్ బోర్డును కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. ఒక్క స్థానంలోనూ విజయాన్ని నమోదు చేసుకోలేదు.
57 వార్డుల్లో 197 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షంతోపాటు ఆప్ కూడా ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులను బరిలో దింపింది. ఈ అభ్యర్థుల సంఖ్యనే ఎన్నికల ప్రాధాన్యతను వెల్లడిస్తున్నది.
కాగా, 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ కోసం బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఆ పార్టీ ముఖ్యనాయకులతో కలిసి మూడు బృందాలు ఏర్పాటు అయ్యాయి. ఈ బృందాలు మంగళవారం నుంచి తన సన్నాహాలను ప్రారంభించింది. ఇవి ఏప్రిల్ 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తాయి.
ఇందులో ఒక టీమ్‌లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర ఇన్‌చార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇతర రెండు జట్లకు నాయకత్వం వహిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో కూడిన ప్రతీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లి భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యకలాపాలను సమీక్షిస్తుంది.
