Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ చిన్మయానంద్‌ అరెస్ట్: రిమాండ్ కు తరలింపు

బీజేపీ చిన్మయానంద్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ఈ కేసును విచారిస్తోంది.

BJP's Chinmayanand, Accused Of Rape, Arrested, Sent To Jail For 14 Days
Author
Uttar Pradesh, First Published Sep 20, 2019, 12:36 PM IST


లక్నో: బీజేపీకి చెందిన చిన్మయానంద్‌ను శుక్రవారం నాడు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదు రోజుల క్రితం ఓ మహిళ తనపై ఏడాది కాలంగా చిన్మయానంద్ లైంగిక  దాడికి దిగుతున్న విషయాన్ని బయటపెట్టింది. 

చిన్మయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనను 14 రోజుల రిమాండ్ కు తరలించింది.అయితే చిన్మయానంద్  తరపు న్యాయవాది మాత్రం ఆయనపై మోపబడిన అభియోగాలను తోసిపుచ్చారు.  అరెస్ట్ చేయడానికి ముందుగానే చిన్మయానంద్ ను పోలీసులు షాజహన్ పూర్ లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

చిన్మయానంద్ బలహీనంగా ఉన్నాడని ఆయన లాయర్ మీడియాకు చెప్పారు.చిన్మయానంద్ ను ఆయన ఇంట్లోనే శుక్రవారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు.

యూపీ రాష్ట్రంలో పలు విద్యాసంస్థలు, ఆశ్రమాలు నడుపుతున్న ప్రముఖ రాజకీయ నాయకుడు చిన్మయానంద్. ఓ మహిళ తనపై చిన్మయానంద్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పోలీసులు తిరస్కరించారు.  మహిళను కిడ్నాప్, బెదిరించారనే ఆరోపణలపై కేసు పెట్టారు.ఆ మహిళ కన్పించకుండాపోయిన తర్వాతే  తీవ్రమైన  ఆరోపణలు చేశారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ప్రభుత్వం మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించిన తర్వాతి రోజునే చిన్మయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చిన్మయానంద్ నడిపే లా కాలేజీలో స్టూడెంట్ సోమవారం నాడు కోర్టుకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది.

ఈ కేసులో సుప్రీంకోర్టుతో ప్రత్యేకంగా నియమించిన సిట్ బృందం చిన్మయానంద్ పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించింది. అంతేకాదు అరెస్ట్ చేయడానికి కూడ సానుకూలంగా లేదు.

కచ్చితమైన సాక్ష్యాధారాలు లేనిదే ఈ కేసులో అరెస్ట్ చేయలేమని సిట్ బృందం తేల్చింది. చిన్మయానంద్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టుగా బాధిత యువతి చెప్పింది.తన కాలేజీలో ఆడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పి ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆమె ఆరోపించింది.

తాను స్నానం చేసే సమయంలో ఫోన్‌లో చిత్రీకరించి తనను చిన్మయానంద్ బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనపై పలుమార్లు అతను అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె చెప్పింది.

చిన్మయానంద్ తనపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో సాక్ష్యాలను సేకరించినట్టుగా బాధితురాలు చెప్పారు. తాను ధరించిన కళ్లజోడులో రహస్యంగా బిగించిన కెమెరా ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేసినట్టుగా ఆమె చెప్పారు.

ఈ ఏడాది ఆగష్టు 24 వతేదీన ఆమె అదృశ్యమైంది. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ఆమె అదృశ్యమైంది. దీంతో ఈ కేసు వెలుగు చూసింది. ఆ సమయంలో ఆమె చిన్మయానంద్ పేరును ఫేస్ బుక్ లో పోస్టు చేయలేదు.

వారం రోజుల తర్వాత పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం బాధిత యువతి ఉండే హాస్టల్ గదిని పరిశీలించింది. ఆమెను ఈ విషయమై ప్రశ్నించింది. ఆ తర్వాత  ఏడు గంటల పాటు చిన్మయానంద్ ను సిట్ బృందం విచారించింది. ఈ విచారణ గత వారం క్రితం చోటు చేసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios