మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో వారి నుండి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించినా కూడ దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి పట్టించుకోలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

దంతెవాడ:మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో వారి నుండి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించినా కూడ దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి పట్టించుకోలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

లోక్‌సభ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి ముగింపుకు కొన్ని గంటల ముందు ప్రచారాన్ని పూర్తి చేసుకొని మండవి తిరిగి వెళ్తున్న సమయంలోనే మావోల మందుపాతరకు ఎమ్మెల్యే మండవి సహా ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.

మూడు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందనగా నకులూరులో ప్రచారానికి ఎమ్మెల్యే వెళ్లారు. అయితే ఈ ప్రాంతం మావో ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ఎమ్మెల్యేను ముందే హెచ్చరించారు. మావోలు దాడులకు దిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేశారు.

అయితే ఈ సమయంలో ఇది నా ప్రాంతం... ఇక్కడి ప్రజల గురించి తనకు తెలుసునని ఆయన పోలీసుకు చెప్పారు. అంతేకాదు పోలీసులను అధైర్యపడకూడదని సూచించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

నకులూరుకు సమీపంలోని కట్టె కళ్యాణ్ ప్రాంతంలో రోడ్డుపై మావోలు అమర్చిన మందుపాతరకు భీమ మృత్యువాత పడ్డారు. కాన్వాయ్‌లో చివర్లో భీమ మండవి ప్రయాణీస్తున్న వాహనం ఉంది.ఈ వాహానాన్ని లక్ష్యంగా చేసుకొని మావోలు మందుపాతరను పేల్చడంతో ఈ వాహనంలో ఉన్న వారంతా మృతి చెందారు.

సంబంధిత వార్తలు

మావోల దాడి: బీజేపీ ఎమ్మెల్యే సహా ఐదుగురు మృతి