Mamata Banerjee: దేశంలో బీజేపీ తుగ్లక్ పాల‌న న‌డుస్తోంద‌నీ, ఎవరికీ స్వేచ్ఛా హక్కు లేదని పశ్చిమ బెంగాల్ సిఎం, టిఎంసి చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని అవమానించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. టీఎంసీని అణగదొక్కడం ఎవ్వ‌రికీ సాధ్యం కాదని, పార్టీ కార్యకర్తలు మరింత శ్రమించి, కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

Mamata Banerjee: దేశంలో బీజేపీ తుగ్లక్ పాల‌న న‌డుస్తోంద‌నీ, ఎవరికీ స్వేచ్ఛా హక్కు లేదని పశ్చిమ బెంగాల్ సిఎం, టిఎంసి చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. బిజెపి కేంద్ర ఏజెన్సీ ద్వారా 'తుగ్లక్ కుంభకోణం' నడుపుతోందని అన్నారు. బీజేపీ త‌న స్వార్థ‌ రాజకీయం కోసంఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

బెంగాల్ లోని ఝార్‌గ్రామ్‌లో జ‌రిగిన స‌మావేశంలో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో తుగ్లక్ పాలనను నడుపుతోందనీ, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందనీ. కేంద్ర సంస్థలను నియంత్రిస్తూ రాజకీయ ఖాతాలను సెటిల్ చేసేందుకు వాటిని ఉపయోగించుకుంటున్నార‌ని ఆరోపించారు. బీజేపీ పాల‌న‌లో స్వేచ్ఛ పొందే హక్కు ఎవరికీ లేదనీ, అన్ని హక్కులను బీజేపీ రద్దు చేసిందని అన్నారు.

అలాగే.. ఎస్‌ఎస్‌సి నియామకాల్లో అవకతవకలు జరుగుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ హయాంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని, వాటి వివరాలను త్వరలో వెల్లడిస్తానని మమత పేర్కొన్నారు.

రిక్రూట్‌మెంట్‌లో వైరుధ్యాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, కానీ.. ఈ దుష్ప్రచారాన్ని ఆపాలని అన్నారు. 
వామపక్షాల హయాంలో కాగితాలపై పేర్లు రాసి ఉద్యోగాలు ఇచ్చేవారు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీటిపై. త్వరలోనే అక్రమాలను బయటపెడతానని అన్నారు. 

TMC విద్యా మంత్రి పరేష్ అధికారి, అతని కుమార్తెపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు వారికి హైకోర్టు గడువు ఇచ్చింది. సీబీఐ ఆదేశాలను పాటించకుంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇది SSC రిక్రూట్‌మెంట్ అవకతవకలకు సంబంధించింది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌లు 420, 120బి, అవినీతి నిరోధక చట్టం ప్రయోగించబడ్డాయి. సీనియర్ మంత్రి పార్థ ఛటర్జీ నిన్న ఇదే విచారణకు హాజరయ్యారు.

రాష్ట్రంలో పెను వివాదంగా మారిన ప్రభుత్వ పాఠశాలల నియామకాల్లో అక్రమాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని సీబీఐ బుధవారం సాయంత్రం మూడు గంటలకు పైగా ప్రశ్నించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జరిగిన అవకతవకలను బహిరంగ కుంభకోణంగా పేర్కొన్న కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఛటర్జీ సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు.

అలాగే.. ఆవుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మండల్ కూడా సీబీఐ (CBI)విచార‌ణ‌కు హ‌జ‌ర‌య్యారు. ఇలా టీఎంసీ (TMC) నేతలు వరుసగా సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటుండటంతో మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడరాదని, నిష్కళంకులుగా ఉండాలని టీఎంసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏదైనా పథకానికి నిధులు అందకపోతే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు.