Mamata Banerjee: రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ పాలన అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్ పాల‌న‌ కంటే దారుణంగా ఉందని మమతా బెనర్జీ విమ‌ర్శించారు.  

Mamata Banerjee: కేంద్ర‌ప్ర‌భుత్వంలోని బీజేపీ పాల‌న‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ‌రోసారి మండిప‌డింది. కేంద్ర ప్ర‌భుత్వ( కాషాయ‌) పాలన హిట్లర్, స్టాలిన్ పాల‌న‌ కంటే దారుణంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తోందని అన్నారు. కేంద్ర‌ ఏజెన్సీలను ఉపయోగించుకుని రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని మమత ఆరోపించారు.

కోల్‌కతాలో జరిగిన ఓ సదస్సులో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 'బీజేపీ పాలన అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్ లేదా బెనిటో ముస్సోలినీ పాలన కంటే దారుణంగా ఉంది' అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. ఏజన్సీలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా న్యాయంగా పనిచేసేందుకు అనుమతించాలని ఆయన అన్నారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. దేశంలో తుగ్లక్ పాలన నడుస్తోంది. అదే సమయంలో.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఇంధన ధరలను తగ్గించడం, ఎల్‌పిజిపై రూ. 200 సబ్సిడీ ఇస్తామని కేంద్రం ప్రకటించడంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇది ఎన్నిక‌ల స్టంట్ అని.. ఏ ఎన్నికల ముందు అయినా.. బిజెపి ఇలా చేస్తుందని అన్నారు. ఉజ్వల పథకం కింద BPL వర్గంలో కొద్ది భాగం మాత్రమే ఉంది. పేద ప్రజలు రూ.800తో డొమెస్టిక్ గ్యాస్ ఎలా కొంటార‌ని ప్ర‌శ్నించింది. 

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం శనివారం తగ్గించిన విష‌యం తెలిసిందే. కేంద్రం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 పన్ను తగ్గించింది. ఆ తర్వాత పెట్రోల్ ధర రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు రూ.200 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్, "ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో 9 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందజేస్తామని , ఇది మా తల్లులు, సోదరీమణులకు సహాయం చేస్తుందని అన్నారు.