Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎంపీకి చీర బహుమతిగా పంపిన ఛత్తీస్ గఢ్ సీఎం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సరోజ్ పాండే ఓ రాఖీని, ఓ లేఖను ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌కు పంపించారు. 2018 శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. 

BJP RS member Saroj Pandey seeks liquor ban as 'Rakhi gift' but Chhattisgarh CM sends her 'saree'
Author
Hyderabad, First Published Jul 25, 2020, 9:18 AM IST

బీజేపీ ఎంపీ సరోజ్ పాండేకి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ చీర బహుమతిగా పంపారు. రాఖీ పండగ సందర్భంగా సంపూర్ణ మద్య పాన నిషేధం విధించాలంటూ బీజేపీ సరోజ్ పాండే ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలో ఆమెకు  ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ సంప్రదాయబద్ధమైన చీర పంపించారు. తన ప్రభుత్వం మద్య నిషేధంపై చర్యలు ప్రారంభించిందని చెప్పారు. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సరోజ్ పాండే ఓ రాఖీని, ఓ లేఖను ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌కు పంపించారు. 2018 శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. 

దీనిపై బాఘేల్ స్పందిస్తూ, తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మద్య నిషేధానికి చర్యలు ప్రారంభించిందని తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు పంపినట్లుగానే రాఖీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు పంపించి, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడం గురించి అడగాలనే ఆలోచన వచ్చి ఉంటే అభినందించి ఉండేవాడినని సరోజ్ పాండేను ఉద్దేశించి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios