Asianet News TeluguAsianet News Telugu

సంపన్న పార్టీగా బీజేపీ.. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ లేదు.. ఏ పార్టీ ఉందంటే?.. టీఆర్ఎస్ పొజిషన్ ఇదీ


దేశంలో అతి సంపన్నపార్టీగా బీజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ సంపన్న పార్టీగా కమలం పార్టీనే నిలిచింది. అయితే, దాని తర్వాతి స్థానంలో మాత్రం కాంగ్రెస్ లేకుండా పోవడం ఆసక్తికరంగా మారింది. రెండో స్థానంలో ఊహించని విధంగా బీఎస్పీ పార్టీ వచ్చి చేరింది. రూ. 4847.78కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రూ. 698.33 కోట్లతో బీఎస్పీ, మూడో స్థానంలో రూ. 588.16 కోట్లతో కాంగ్రెస్ ఉన్నది.
 

bjp richest party and bsp is in next place.. ADR report on assets
Author
New Delhi, First Published Jan 29, 2022, 1:58 PM IST

న్యూఢిల్లీ: దేశంలో సంపన్న పార్టీ (Richest Party)గా బీజేపీ (BJP) ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, 2019-20 ఏడాదిలోనూ ఇదే పార్టీ సంపన్నవంతమనదిగా ఉన్నదని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ADR) వెల్లడించింది. అయితే, దానికంటే ఆసక్తికర పరిణామం ఒకటి ఎదురైంది. ఇన్నాళ్లు బీజేపీ అత్యంత సంపన్న పార్టీగా ఉంటే దానికి చాలా దూరంలోనైనా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచేది. కానీ, ఈ సారి రెండో స్థానంలో కాంగ్రెస్ లేకుండా పోయింది. రెండో స్థానంలో ఎవరూ ఊహించని విధంగా బహుజన్ సమాజ్ పార్టీ (BSP)నిలిచింది. కాగా, కాంగ్రెస్(Congress) మూడో స్థానంలో ఉన్నదని ఏడీఆర్ వెల్లడించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీ తన ఆస్తుల మొత్తాన్ని రూ. 4,847.78 కోట్లుగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో కెల్లా అత్యంత మొత్తం ఈ పార్టీనే ప్రకటించింది. కాగా, రెండో స్థానంలో రూ. 698.33 కోట్లతో బీఎస్పీ నిలిచింది. దేశంలోని అతివృద్ధ కాంగ్రెస్ పార్టీ రూ. 588.16 కోట్లుగా తన ఆస్తులను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీల ఆస్తులపై ఏడీఆర్ విశ్లేషణల ఆధారంగా ఈ రిపోర్టు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తులు రూ. 6,988.57గా ఉండగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం రూ. 2,129.38గా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. 

జాతీయ పార్టీల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ రూ. 4847.78 కోట్లు, బీఎస్పీ రూ. 698.33 కోట్లుగా ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్ 588.16 కోట్లను వెల్లడించింది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తులలో బీజేపీకి సింహభాగం అంటే 69.37 శాతం ఉన్నది. కాగా, 44 ప్రాంతీయ పార్టీల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఇందులో టాప్ 10 పార్టీల ఆస్తుల మొత్తమే 95.27 శాతంగా ఉండటం గమనార్హం.

2019-20 సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల్లో సంపన్న పార్టీగా సమాజ్ వాదీ పార్టీ ఉన్నది. ఈ పార్టీ తన ఆస్తుల మొత్తాన్ని రూ. 563.47 కోట్లుగా ప్రకటించింది. కాగా, రెండో పొజిషన్‌లో టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ తన ఆస్తులను రూ. 301.47 కోట్లుగా వెల్లడించింది. ఏఐఏడీఎంకే పార్టీ రూ. 267.61 కోట్లుగా తన ఆస్తిని తెలిపింది. రూ.188 కోట్ల ఆస్తులతో తెలుగుదేశం నాలుగో స్థానంలో నిలవగా, వైఎస్సార్‌సీపీకి రూ.143 కోట్ల ఆస్తులున్నాయి.

ప్రాంతీయ పార్టీలు తమ మూలధనం, రిజర్వ్ నిధులను కూడా ప్రకటించాయి. దీని ప్రకారం టీఆర్‌ఎస్‌కు రూ.297.06 కోట్లు, టీడీపీకి రూ.157.84 కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.143.31 కోట్ల మూలధనం, రిజర్వ్ నిధులు ఉన్నాయి.

రుణాలు తీసుకున్న ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లేదా ఏజెన్సీల వివరాలను ప్రకటించాలని పార్టీలకు సూచించే ICAI మార్గదర్శకాలను పాటించడంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయని కూడా ఇందులో తేలింది. సంవత్సరం లోగా... 1-5 సంవత్సరాలు... లేదా ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన గడువు తేదీ ఆధారంగా పార్టీలు "టర్మ్ లోన్‌ల రీపేమెంట్ నిబంధనలను" పేర్కొనాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios