కోల్‌కత్తా:బెంగాల్ రాష్ట్రంలో తొలి రెండు విడతల్లో పోటీ చేసే 57 మంది అభ్యర్ధుల జాబితాను బీజేపీ శనివారం నాడు ప్రకటించింది. 

బీజేపీ సెంట్రల్ కమిటీ శనివారం నాడు 57 మంది జాబితాతో బెంగాల్ లో పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. నందిగ్రామ్ నుండి టీఎంసీ నుండి బీజేపీలో చేరిన సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది.

నందిగ్రామ్ నుండి  టీఎంసీ అభ్యర్ధిగా మమత బెనర్జీ పోటీ చేస్తానని ప్రకటించారు. టీఎంసీ  తన అభ్యర్థుల జాబితాను శుక్రవారం నాడు ప్రకటించింది. శనివారం నాడు బీజేపీ ప్రకటించిన జాబితాలో సువేందు అధికారి పేరు ఉంది. నందిగ్రామ్ నుండి సువేంధు బరిలోకి దిగుతున్నారు.

 

నందిగ్రామ్ నుండి మమత బెనర్జీ పోటీ చేస్తే ఆమెను 50 వేల మెజారిటీతో ఓడిస్తానని  సువేంధు అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే.శుక్రవారం నాడు టీఎంసీ 291 అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. కేవలం 3 స్థానాలను మాత్రమే టీఎంసీ ప్రకటించాల్సి ఉంది. టీఎంసీ నుండి పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు.