Asianet News TeluguAsianet News Telugu

BJP Parliamentary Board: బీఎస్ యడ్యూరప్ప ఇన్, నితిన్ గడ్కరీ, శివ‌రాజ్ సింగ్ అవుట్..

BJP Parliamentary Board: బీజేపీలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు షాక్ ఇచ్చింది. విధాన నిర్ణాయ‌క సంస్థ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ల‌ను తొలిగించింది. 

BJP Parliamentary Board BS Yediyurappa In, Nitin Gadkari Out, No Yogi Adityanath
Author
Hyderabad, First Published Aug 18, 2022, 1:28 AM IST

BJP Parliamentary Board: కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ల‌కు బీజేపీలో విధాన నిర్ణాయ‌క సంస్థ పార్ల‌మెంట‌రీ బోర్డు ఊహించ‌ని షాక్ త‌గిలింది. పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో నుంచి వీరిద్ద‌రికి ఉద్వాస‌న ప‌లికింది బీజేపీ అధిష్టానం.  వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగే క‌ర్ణాట‌క‌లో బీఎస్ యెడియూర‌ప్ప‌, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ల‌కు ఈ క‌మిటీల్లో చోటు ద‌క్కింది. 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో రెండోసారి అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పేరు కూడా చోటు ద‌క్క‌లేదు. తొలిసారి బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులోకి సిక్కు నేత‌తోపాటు ఆరుగురికి అవ‌కాశం క‌ల్పించారు. అంతేకాదు.. రాజ‌కీయంగా త‌రం మార్పిడి తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలో బీఎస్ యెడియూర‌ప్ప స్పందించారు. పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో పార్టీ నిర్ణయాధికారులు అత్యున్నతమని పేర్కొన్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు & సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో పనిచేయడానికి త‌న‌  అవకాశం క‌ల్పించిన‌ ప్రధాని నరేంద్ర మోదీ,  జేపీ నడ్డా, అమిత్ షా ల‌కు  ధన్యవాదాలు అని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాన‌ని అన్నారు. 

అనుభవజ్ఞులైన నాయకుల పట్ల తమకు ఇంకా ఎంతో గౌరవం ఉందని, వారి అనుభవాన్ని, సలహాలను ఉపయోగించుకునేందుకు ఆసక్తిగా ఉందనే సందేశం పంపేందుకు బిజెపి నాయకత్వం చేస్తున్న ప్రయత్నమే ఇది అని పార్టీ వర్గాల్లో పలువురు భావిస్తున్నారు.

అయితే లింగాయత్ నేతను బీజేపీ పక్కనపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనను పోటీకి దింపితే తాను బీవై విజయేంద్ర కుమారుణ్ణని.. తన శికారిపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తానని యడ్యూరప్ప ఇటీవలే ఎన్నికల రాజకీయాల్లో తన ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడంతో పార్టీ నాయకత్వం ఈ చర్యకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర పర్యటన సందర్భంగా యడ్యూరప్పతో సమావేశమయ్యారు. ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన నాయకుడు నిష్క్రియంగా ఉండటం వల్ల ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతున్నందున, యడియూరప్ప పక్కన పెట్టినట్లు భావించకుండా చూసుకోవాలని నాయకత్వం కోరుతున్నట్లు వర్గాలు తెలిపాయి.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లను భాజపా తన పార్లమెంటరీ బోర్డు నుంచి బుధవారం భారీ పునర్వ్యవస్థీకరణలో తొలగించింది. యడ్యూరప్ప, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా (మొదటి సిక్కు ప్రతినిధి) సహా ఆరుగురు కొత్త సభ్యులను తీసుకొచ్చారు.

ఆరెస్సెస్ తో స‌న్నిహిత సంబంధాలున్న నితిన్ గ‌డ్క‌రీకి చోటు ద‌క్క‌క‌పోవ‌డం షాకింగ్ విష‌యం. ఇటీవ‌లే నితిన్ గ‌డ్క‌రీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌న‌నీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌ను దృష్టిలో పెట్టుకుని .. ఆయ‌న‌ను దూరం పెట్టార‌ని టాక్. 

మ‌రో కీల‌క విష‌యమేమింటంటే.. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌లో తిరుగుబాటును ప్రోత్స‌హించి, సీఎం ఏక్‌నాథ్ షిండేతోపాటు డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు చోటు క‌ల్పించడం మ‌రో గ‌మ‌నార్హం. అలాగే..  అసోంలో సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న ను ప‌క్కన పెట్టి.. ఆ రాష్ట్ర మాజీ సీఎం స‌ర్బానంద సోనోవాల్‌కు చోటు క‌ల్పించ‌డం  ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న ఏకైక ముస్లిం నేత షానావాజ్ హుస్సేన్‌ను త‌ప్పించారు. దీంతో కేంద్ర క్యాబినెట్‌లో మంత్రిగా గానీ, ఎంపీగా గానీ, మ‌రే ఇత‌ర పోస్ట్‌లో గానీ ముస్లిం నేత‌లు లేరు. ఇటీవ‌ల కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ న‌క్వీ రాజీనామా చేశారు. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులో స‌భ్యులుగా ఉన్న వారికి  పార్టీ ఎన్నిక‌ల క‌మిటీలో చోటు ద‌క్కుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios