పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి ఓ పనిమనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది బీజేపీ. ఆమెను ఎంపిక చేయటంపై స్థానిక బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా కలితా పేరు చూసిన వారు.. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. బీజేపీ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో నెల రోజుల పాటు తన పనికి సెలవు పెట్టింది. 

తనను గెలిపించాలంటూ ప్రచారం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది కలితా. ఆమె భర్త సుబ్రతా మజ్హీ ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. పేదరికం కారణంగా కలితా చదువుకోలేదు. అయితే ప్రచారంలో నేరుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టారు. 

ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి.. ‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.