Asianet News TeluguAsianet News Telugu

విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీలోకి జిన్నా ఆత్మ ప్రవేశిస్తుంది.. బీజేపీ నేత నఖ్వీ

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు.

BJP Mukhtar Abbas Naqvi attacks Rahul gandhi and says Jinnah spirit enters his body when he is abroad ksm
Author
First Published May 31, 2023, 3:49 PM IST

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడల్లా ఆయనలో మహ్మద్ అలీ జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.  ‘‘రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన శరీరంలోకి జిన్నా ఆత్మ లేదా అల్-ఖైదా వంటి వ్యక్తుల ఆలోచన ప్రవేశిస్తుంది. నేను అతనిని భారతదేశానికి వచ్చి ఒక మంచి భూతవైద్యుని వద్ద భూతవైద్యం చేయించుకోమని సూచిస్తాను’’ అని ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ దౌర్జన్యాన్ని సమ్మిళిత అభివృద్ధి ద్వారా ప్రధాని మోదీ ఎలా నాశనం చేశారో జీర్ణించుకోలేకపోవడమే రాహుల్ గాంధీకి ఉన్న ప్రధాన సమస్య అని ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రాజవంశంతో సమానం అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారతదేశ పరువు తీయడానికి రాహుల్ గాంధీ కాంట్రాక్ట్ తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను చూయింగ్ గమ్ లాగా ఉపయోగించిందని విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యకర్తలు, విద్యావేత్తలు మరియు పౌర సమాజ సభ్యులతో సంభాషించారు. ప్రధాని మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే వివరిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. శాస్త్రవేత్తలకు సైన్స్‌ను, చరిత్రకారులకు చరిత్రను వివరించగలమని విశ్వసించే వ్యక్తుల సమూహం భారతదేశాన్ని నడిపిస్తోందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ప్రజలను బెదిరిస్తోందని ఆరోపణలు చేశారు. 

కేంద్రం ఏజెన్సీలను "దుర్వినియోగం" చేస్తోందని మరియు ప్రజలను "బెదిరిస్తోందని" గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి మరింత తీవ్రమైన సమస్యల నుంచి ప్రజలను మరల్చడానికి బీజేపీ బంగారు రాజదండం సెంగోల్‌ను ఉపయోగిస్తోందని విమర్శలు గుప్పించారు. 

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఖండించారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచమంతా గుర్తిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ‘‘ప్రధానమంత్రి మోదీ ఇటీవల తన విదేశీ పర్యటనలో దాదాపు 24 మంది ప్రధానులు, అధ్యక్షులను కలుసుకున్నారు. 50 కి పైగా సమావేశాలు నిర్వహించారు. మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని పలువురు ప్రపంచ నేతలు చెబుతున్నారు. ‘పీఎం మోదీ బాస్‌’ అని ఆస్ట్రేలియా ప్రధాని అనడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు’’ అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios