Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ తేజస్వి సూర్య అరుదైన ఘనత.. ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజ్ ను పూర్తిచేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డు...

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఐరన్ మ్యాన్ రిలే  ఛాలెంజ్ ను పూర్తిచేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డు సాధించారు.

BJP MPTejasvi Surya becomes first MP to complete Ironman Relay Challenge
Author
First Published Nov 14, 2022, 11:36 AM IST

బిజెపి ఎంపీ తేజస్వి సూర్య అరుదైన ఘనత సాధించారు.   ఐరన్ మ్యాన్ రిలే  ఛాలెంజ్ ను పూర్తిచేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. ట్రయాథ్లాన్ భాగంగా ఏకంగా 90 కి.మీ.లు సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి సత్తాచాటుకున్నారు.

వివరాల ప్రకారం…టీం న్యూ ఇండియాలో భాగంగా బెంగళూరు సౌత్ నియోజకవర్గం బిజెపి ఎంపీ తేజస్వి సూర్య.. ఐరన్ మాన్ 70,3లో సివిల్ సర్వెంట్ శ్రేయాస్ హోసూర్, వ్యవస్థాపకుడు అనికేత్ జైన్ లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా మొదట 1.9కి.మీల స్విమ్మింగ్ లెగ్ ని ఈదగా, 2వ లెగ్ ఈవెంట్ కోసం పూర్య 90కి.మీ. సైకిల్ తొక్కాడు. ఆ తరువాత అనికేత్ జైన్ 21.1కి.మీ హాఫ్ మారథాన్ ను పూర్తి చేశాడు. 

బెంగళూరు వరదలు.. దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య... వీడియో వైరల్...

అనంతరం తేజస్వీ సూర్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలు, ఫిట్ నెస్ పై పలు కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు.  అలాగే, ఐరన్ మ్యాన్ 70.3 ఛాలెంజ్ అనేది మన ఓర్పును పరీక్షించే ఒక వేదిక. మంచి ఆరోగ్యం, ఫిట్ నెస్ న పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువమంది యువకులు క్రీడలు, ఫిట్ నెస్ ను కెరీర్ గా స్వీకరించడానికి ముందుకువస్తున్నారు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అన్నారు.

ఇక, ఈ ఛాలెంజ్ ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 33 దేశాలనుంచి దాదాపు 1,500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. కాగా, ఐరన్ మ్యాన్ 70.3.. దీన్ని హాఫ్ ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇది స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ తో కూడిన ట్రయాథాన్, 70.3 మైళ్లలో పాల్గొనేవారు కవర్ చేసే దూరాన్ని సూచిస్తుంది. మొదటి ఐరన్ మ్యాన్ 70.3 2019లో గోవాలో జరిగింది. కోవిడ్-19 కారణంగా తదుపరి రెండు ఎడిషన్ లు రద్దు చేయబడ్డాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios