Asianet News TeluguAsianet News Telugu

అతడు సినిమా స్టైల్లో: బావతో ఎటాక్ చేయించుకున్న ఎంపీ కుమారుడు, గుట్టువిప్పిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నేత, ఎంపీ కౌశల్‌ కిశోర్‌ కుమారుడు ఆయుష్‌పై కాల్పులు జరిగాయి. లక్నోలోని మదియావా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయుష్‌ తన బంధువుతో కలిసి బయటకు వెళ్లగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

BJP MPs Son 30 Shot At In Lucknow Police Say Attack Staged ksp
Author
lucknow, First Published Mar 3, 2021, 5:46 PM IST

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నేత, ఎంపీ కౌశల్‌ కిశోర్‌ కుమారుడు ఆయుష్‌పై కాల్పులు జరిగాయి. లక్నోలోని మదియావా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయుష్‌ తన బంధువుతో కలిసి బయటకు వెళ్లగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆయుష్ ఛాతీ, భుజానికి గాయమైంది.   

అయితే ఈ కాల్పుల ఘటన నాటకమేనని పోలీసులు అంటున్నారు. తన ప్రత్యర్థులను ఇరికించేందుకు ఆయుష్‌ తనపై తానే దాడి చేయించుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీటీవీ సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. ఆయుష్‌పై తన బావ ఆదర్శ్‌ కాల్పులు జరిపినట్లు తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసి విచారించారు.   

కాగా.. విచారణలో ఆదర్శ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎంపీ కుమారుడిపై కాల్పులు జరిపింది తానే అని అంగీకరించిన ఆదర్శ్‌.. ఇదంతా ఆయుష్‌ ప్లాన్‌లో భాగమేనని చెప్పాడు. తన ప్రత్యర్థి అయిన ఓ వ్యక్తిని ఇరికించేందుకు ఆయుషే తనతో ఈ పని చేయించాడని ఆదర్శ్‌ చెప్పాడు.

దర్యాప్తులో భాగంగా ఎంపీ కుమారుడి ఇంట్లో ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బుల్లెట్‌ గాయాలకు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ఆయుష్‌.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై తాము మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.   

కాగా, ఆయుష్‌ తండ్రి కౌశల్‌ కిశోర్‌ యూపీలోని మోహన్‌లాల్‌ గంజ్‌ లోక్‌సభ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తల్లి జయ దేవి మలిహాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయుష్‌ తన భార్యతో కలిసి విడిగా ఉంటున్నాడని, కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలు తెలియదని కౌశల్ వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios