కరోనా ఎఫెక్ట్: 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో సురేష్ ప్రభు
సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారు.
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారు.
జీ-20 సదస్సుకు భారత్ తరపున బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరు కాబోనని సురేష్ ప్రభు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.
ముందు జాగ్రత్తగా చేయించుకొన్న పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలిందని ఆయన స్పష్టం చేశారు. ఐసోలేషన్ సమయం ముగిసే వరనకు తాను ఇంటికే పరిమితం కానున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు కూడ తాను హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు. మరో వైపు మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సురేష్ ప్రభు ఈ నిర్ణయం తీసుకొన్నారు.