గురుదాస్‌పూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, గురుదాస్‌పూర్ ఎంపీ సన్నిడియోల్  చేసిన పని వివాదాస్పదమైంది. తాను ఎంపీగా ఉన్నప్పటికీ అధికారిక సమావేశాలకు మాత్రం తాను నియమించిన వ్యక్తి  హాజరౌతారని ప్రకటించారు. ఈ మేరకు ఆయన  ఓ లేఖను విడుదల చేశారు.

మొహాలీ జిల్లా పల్హేరీ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని తన ప్రతినిధిగా నియమిస్తున్నట్టుగా  సన్నిడియోల్ ప్రకటించారు. ఇక నుండి తన నియోజకవర్గంలో అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు తన తరపున   గురుప్రీత్ సింగ్ హాజరౌతారని ఆయన చెప్పారు.

ఈ మేరకు ఆయన ఆ లేఖలో  వివరించారు. సన్నిడియోల్  విడుదల చేసిన ఈ లేఖపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.తనను గెలిపించిన ప్రజలను సన్నిడియోల్ వంచిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. 

ఒటర్లు ఎన్నుకొన్న వ్యక్తి మరో వ్యక్తిని  ఎలా నియమిస్తారని ఆయన నిలదీశారు. కేవలం స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సన్నిడియోల్ తనను నియమించారని గురుప్రీత్ సింగ్ వివరణ ఇచ్చారు.