Asianet News TeluguAsianet News Telugu

మమతా బెనర్జీ మ్యారిటల్ స్టేటస్ పై బీజేపీ ఎంపీ కామెంట్.. ‘కుమారి అనాలా? శ్రీమతి అనాలా?’

బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే.. మమతా బెన్జీని ఎలా సంబోధించాలి? కుమారి అని అనాలా? శ్రీమతి అనాలా? అంటూ కొత్త చర్చను తెచ్చారు.
 

bjp mp saumitra khan brutal jibe on west bengal cm mamata banerjee on her marital status
Author
First Published Aug 29, 2022, 3:30 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిష్ణుపూర్ ఎంపీ అయిన సౌమిత్రా ఖాన్.. సీఎం మమతా బెనర్జీ మ్యారిటల్ స్టేటస్ పై ప్రశ్నలు వేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా కుమారి అనాలా? శ్రీమతి అనాలా?’ అని అడిగారు.

బంకూరా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తూ.. అభిషేక్ బెనర్జీని కూడా టార్గెట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జనరల్  సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ జంతారా గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నాడని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు.

ఈ ఎన్నికలను నాశనం చేయాలని చూస్తే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, టీఎంసీ చేసే అన్ని అక్రమ లావాదేవీలను బయట పెడతామని హెచ్చరించారు. దీనితోపాటు ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ.. సీపీఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి బీజేపీ, సీపీఎం కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాలని అన్నారు. బీజేపీని సీపీఎం బలోపేతం చేస్తుందని అంచనా వేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios