Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి మహిళా ఎంపీ కారు మీద దాడి.. రాళ్లు, రాడ్లతో వీరంగం, స్పృహ తప్పి...

జైపూర్ లో దారుణం జరిగింది. కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెడుతున్న బీజేపీ లోక్ సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురయ్యింది. ఒక్కసారిగా ఆమె కారును నిలువరించిన దుండగులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోయింది. వాహనం తీవ్రవంగా దెబ్బతిన్నది.

BJP MP Ranjeeta Koli's car attacked with stones, iron rods in Rajasthan's Bharatpur - bsb
Author
Hyderabad, First Published May 28, 2021, 12:46 PM IST

జైపూర్ లో దారుణం జరిగింది. కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెడుతున్న బీజేపీ లోక్ సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురయ్యింది. ఒక్కసారిగా ఆమె కారును నిలువరించిన దుండగులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోయింది. వాహనం తీవ్రవంగా దెబ్బతిన్నది.

ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్, భరత్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రులు సందర్శిస్తున్నారు. మంగళవారం ఆస్పత్రుల సందర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్ పూర్ వెల్తున్నారు. 

గ్రామంమీదుగా వెల్తుండగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. వారి దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తరువాత వారు డిశ్చార్జయ్యారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని దీనిమీద పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అర్థరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు. 

దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశార. వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రబుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్ అడ్డాగా మారిందని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios