17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను సభ ఏకగ్రీవంగా ఎన్నికుంది. బుధవారం ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఓం బిర్లాను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్రమోడీ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు బలపరిచారు. అనంతరం స్పీకర్ ఎన్నిక పూర్తయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత అదిరంజన్ చౌదరి ఓం బిర్లాను స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టారు.