బీజేపీ ఎంపీ మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీతో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని ఆయన బాంబు పేల్చారు.  

బెంగాలీ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి (mithun chakraborty) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో (BJP) 38 మంది టీఎంసీ (tmc) ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ ఆయన బాంబు పేల్చారు. 38 మందిలో 21 మంది తనతో మాట్లాడుతున్నారని మిథున్ చక్రవర్తి తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్‌లో (west bengal) రాజకీయ వేడి నెలకొంది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

ఇకపోతే.. బెంగాల్‌లో ఈడీ అధికారుల తనిఖీల వ్యవహారం, మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్ట్ ఘటనలు కాకరేపుతున్నాయి. పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై బెంగాల్ పరిశ్రమల మంత్రి పార్థ ఛటర్జీని శనివారం అరెస్టు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అక్రమ నియామకాల్లో ఆయన పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది .

Also REad:Bengal SSC Scam : 20 కోట్లు కాదు..120 కోట్ల స్కామ్ జ‌రిగింది.. పార్థ ఛటర్జీపై సంచ‌ల‌న దావా వేసిన ఈడీ

ఈ త‌రుణంలో పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో సుమారు ₹ 20 కోట్ల నగదు ఈడీకి దొరికింది. ఈ కుంభ‌కోణం కేసులో మంత్రిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ విష‌యంలో మంత్రికి, అర్పితా ముఖర్జీతో సంప్రదింపులు జరిపిన‌ట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆమె ఇంట్లో దొరికిన నగదు నేరపు ఆదాయం అని చెబుతోంది. అర్పితా ముఖర్జీ నివాసంపై ఈడీ శుక్రవారం దాడులు చేసింది.

 మంత్రి ఛటర్జీ అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రికి మూడు సార్లు కాల్స్ చేశాడు. కానీ, ముఖ్య‌మంత్రి నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌నీ "అరెస్ట్ మెమోలో ఈడీ వెల్లడించింది. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి.. త‌న స‌మాచారాన్ని తెలియజేయాలనుకుంటున్న బంధువుల‌కు లేదా స్నేహితుల‌కు అవ‌కాశ‌ముంటుంది. ఈ స‌మ‌యంలో మంత్రి ఛ‌ట‌ర్జీ.. మమతా బెనర్జీకి ఫోన్ చేశార‌ట‌.