మతం, విశ్వాసం ఏదైనా... మహిళలు విడాకులు కావాలని కోరుకోరని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. గురువారం ట్రిపుల్ తలాక్ పై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ బిల్లుపై అధికార పార్టీ, విపక్షాలు ఒక్కో తీరుగా స్పందిస్తున్నాయి. ఈ బిల్లును జేపీసీకి పంపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఎంపీ మీనాక్షి స్పందించారు.

మహిళలు తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుకుంటారని ఆమె అన్నారు. భార్య అనుమతి లేకుండా ఆమెకు విడాకులు ఇవ్వడానికి, ఆమెను వదిలేయడానికి భర్తకు పూర్తి హక్కు ఇవ్వలేమని ఆమె అభిప్రాయపడ్డారు. పురుషులు బట్టలు మార్చినంత సులువుగా మహిళలను మారుస్తుంటారని మండిపడ్డారు.