ఓ బీజేపీ (bjp) ఎంపీ యువ రెజ్లర్ (young wrestler) చెంప చెళ్లుమనిపించి వివాదంలో ఇరుక్కున్నారు. ఓ యువ రెజ్లర్.. ఎంపీ బ్రిజ్ భూషణ్ వద్దకు వచ్చాడు. తనకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని పదేపదే కోరాడు. నిజానికి అక్కడ జరుగుతున్నది అండర్-15 ఈవెంట్. సదరు యువకుడికి అప్పటికే వయసు దాటిపోయింది.
ఓ బీజేపీ (bjp) ఎంపీ యువ రెజ్లర్ (young wrestler) చెంప చెళ్లుమనిపించి వివాదంలో ఇరుక్కున్నారు. వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ (jharkhand) రాజధాని రాంచీ (ranchi) నగరంలో జాతీయ అండర్-15 రెజ్లింగ్ చాంపియన్ షిప్ (under 15 wrestling 2021) నిర్వహిస్తున్నారు. తొలిరోజు పోటీలకు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (brij bhushan sharan singh) చీఫ్ గెస్టుగా విచ్చేశారు. ఆయన ప్రస్తుతం భారత రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు,.
ఇక పోటీలు జరుగుతుండగా ఓ యువ రెజ్లర్.. ఎంపీ బ్రిజ్ భూషణ్ వద్దకు వచ్చాడు. తనకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని పదేపదే కోరాడు. నిజానికి అక్కడ జరుగుతున్నది అండర్-15 ఈవెంట్. సదరు యువకుడికి అప్పటికే వయసు దాటిపోయింది. అతడిని నిర్వాహకులు అనర్హుడిగా పేర్కొన్నారు.
అయినప్పటికీ తనకు పోటీలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని బ్రిజ్ భూషణ్‌ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. ఎంపీ ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోకుండా, తనకు ఆడే అవకాశం కల్పించాలంటూ విసిగించాడు. దాంతో సహనం నశించిన ఎంపీ... అందరి ముందే ఆ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించారు. అనంతరం అతనిని అక్కడి నుంచి నెట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇతర పార్టీల ఎంపీలు బీజేపీ ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. నెటిజన్లు ఎంపీ ప్రవర్తనపై సెటైర్లు వేశారు.
