సారాంశం
మహిళా రెజ్లర్లు తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా మణిపూర్‌లో ఇద్దరు కుకీ యువతలపై జరిగిన దాష్టీకం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: విమెన్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. తాజాగా మణిపూర్‌లో ఇద్దరు కుకీ యువతులను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై స్పందించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఘటన దురదృష్టకరం అంటూ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దిగ్భ్రాంతికరం అంటూ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనను పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు. కానీ, అప్పటికే ఈ ఘటన జరిగిపోయిందని అన్నారు. ఇలాంటి ఘటన విషాదకరం అంటూ పేర్కొంటారు.
Also Read: లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు రెండు రోజుల మధ్యంతర బెయిల్..
మహిళ రెజ్లర్లు.. బ్రిజ్ భూషణ్ పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసు పెట్టినా అరెస్టు చేయడం లేదని సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. ఢిల్లీలో కొన్ని రోజుల పాటు నిరసనలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా.. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌కు బెయిల్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.