చెన్నై: నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి  మక్కల్ నీది మయం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటి కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుపారం రేగింది.ఈ విషయమై కమల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత  ఈసీకి ఫిర్యాదు చేసింది.

నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆశ్విని ఉపాధ్యాయ్ సోమవారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కమల్ ప్రచారంలో పాల్గొనకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని  కోరారు.

తమిళనాడు రాష్ట్రంలోని అరవకురిచిలో ఆదివారం నాడు నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కమల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువే. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే అంటూ  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కమల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బీజేపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.