అవినీతి వల్లే ఓటమి: యోగికి షాకిచ్చిన బిజెపి ఎమ్మెల్యే శ్యాంప్రకాష్

BJP MLA In UP Embarrasses Yogi   Adityanath Government, Blames Own   Party For Defeat In Bypolls
Highlights

యోగికి బిజెపి ఎమ్మెల్యే షాక్

లక్నో: యూపీ రాష్ట్రంలో వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో
బిజెపి ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆ పార్టీ నేతలు
ఇబ్బందిపడుతున్నారు. కైరానా ఎంపీ స్థానంతో పాటు
నూర్పూరు అసెంబ్లీ స్థానంలో బిజెపి ఓటమికి  యూపీ
సీఎంపై అదే పార్టీకి చెందిన బిజెపి ఎమ్మెల్యే శ్యాంప్రకాష్
సంచలన వ్యాఖ్యలు చేశారు.


యూపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న అవినీతి కారణంగానే
కైరానా, నూర్పూరు స్థానాల్లో బిజెపి ఓటమి పాలు కావడం పై
శ్యాం ప్రకాష్ స్పందించారు.

 ఆరెస్సెస్ చేతిలో ప్రభుత్వ పగ్గాలున్నాయన్నారు.
ముఖ్యమంత్రి కూడా నిస్సహాయుడిలా మారారంటూ  
ఫేస్‌బుక్‌లో  పోస్టు చేశారు. ఈ మేరకు ఓ పద్యాన్ని కూడ
ఆయన పోస్ట్ చేశారు. 

ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుపట్టడం తన ఉద్దేశం
కాదని శ్యాంప్రకాశ్ అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే
ఇప్పుడు అవినీతి మరింత పెరిగింది. నా ఆగ్రహానికి కారణం
ఇదేనని ఆయన పేర్కోనడం గమనార్హం.  ప్రజల
అంచనాలకు తగ్గట్టు పనిచేసి వారి హృదయాలను
గెలుచుకోవడంలో తమ ప్రభుత్వం వైఫల్యం
చెందిందన్నారు.


 

loader