ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేవరియా నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్లింల నుంచి కూరగాయలు కొనొద్దని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారికి మతం రంగు పులమడంపై స్వయానా ప్రధాని నరేంద్ర మోడీయే అసహనం వ్యక్తం చేసారు. ఈ వైరస్ కి మతం లేదని, దీనికి మతం రంగును పూలమొద్దని కోరినప్పటికీ... ఈ సదరు ఎమ్మెల్యే లాంటివారు మాత్రం ఇంకా మారడంలేదు. 

వివరాల్లోకి వెళితే... దేవరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ తివారి మార్కెట్లో ముస్లింల దగ్గరి నుండి కూరగాయలు కొనొద్దని ప్రజలను బెదిరించాడు. ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు కాదా? అని ఆయన్ను ప్రశ్నిస్తే... ఇందులో తప్పేముందని వితండవాదానికి దిగాడు. 

ముస్లింలు కూరగాయల మీద ఉమ్మి అమ్ముతున్నారని, అందువల్లనే ఇలా చెప్పవలిసి వస్తుందని అంటున్నారు. బహుశా వాట్సాప్ లో వచ్చే ఫేక్ న్యూస్ చూసి నిజమని నమ్మి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఇక అక్కడితో ఆగకుండా, ఎంఐఎం అధినేత ఓవైసీ హిందువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు లేదు కానీ ఈ చిన్న విషయానికే తనను అంటున్నారా అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యాడు. తానేమి తప్పుగా మాట్లాడలేదని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని అన్నాడు. 

తాను ముస్లింల నుంచి కూరగాయలను కొనొద్దు అన్న మాటను మాత్రం అన్నానని, దానికి కట్టుబడి ఉంటానని అంటున్నాడు ఈ సదరు 75 సంవత్సరాల ఎమ్మెల్యే!

ఇకపోతే, ఏడు రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హార్షవర్ధన్ ప్రకటించారు.మంగళవారం నాడు ఆయన అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

 గత 14 రోజులుగా 47 జిల్లాల్లో ఒక్క కేసు కూడ నమోదు కాలేదన్నారు.21 రోజులుగా 39 జిల్లాల్లో ఒక్క కేసు కూడ  రిపోర్టు కాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 28 రోజులుగా 17 జిల్లాల్లో కూడ ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదన్నారు.

కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యే సంఖ్య కూడ తగ్గిందన్నారు. గత 14 రోజులుగా కరోనా వైరస్ కేసులు రెట్టింపు కావడం 8.7గా ఉందన్నారు.అయితే వారం క్రితం నుండి 10.2 రోజులకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.గత మూడు రోజుల నుండి కరోనా కేసులు రెట్టింపు కావడం 10.9 రోజులకు చేరుకొందన్నారు. 

ఢిల్లీలోని కరోనా వైరస్ కేసుల గురించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌తో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గత 24 గంటల్లో 1,543 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,435కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.