Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో అక్రమంగా ప్లాట్లు అమ్ముతున్నారు.. బీజేపీ ఎమ్మెల్యే సహా 40 మందిపై ఏడీఏ అభియోగాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఏడీఏ పరిధిలోని భూములను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ మేయర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా పలువురు ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా అమ్మేస్తున్నారు. ఈ నేరానికి పాల్పడుతున్నారని 40 మంది పేర్లతో అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఓ జాబితాను కూడా విడుదల చేసింది.
 

bjp mla and mayor selling plots illegally in ayodhya
Author
Lucknow, First Published Aug 7, 2022, 6:15 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పేరు అందరికీ సుపరిచితమే. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) పరిధిలోని భూములను కొందరు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారని ఏడీఏ ఆరోపించింది. తమ పరిధిలోని భూములను అక్రమంగా కొందరు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని, మరికొందరు ఏకంగా ఆ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంది. వీటికి బాధ్యులు చెబుతూ బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ రిశికేశ్ ఉపాధ్యాయ్‌ల పేర్లూ ఉన్నాయి.

మేయర్ రిశికేశ్ ఉపాధ్యాయ్, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తాలు ఈ అభియోగాలను కొట్టిపారేశారు. ఈ జాబితాలో కుట్ర ఉన్నదని ఆరోపించారు. 

తమ పరిధిలోని ఏరియాలో కొందరు భూములను కొనుగోళ్లు చేస్తున్నారని, మరికొందరు అమ్మేస్తున్నారని ఏడీఏ తెలిపింది. ఈ ఏరియాలో నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ 40 మంది జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది.

వీరితోపాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌నాథ్ బాబా పేరు కూడా ఉన్నది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీలు ఈ విషయమై వాదోపవాదాలు చేశారు. అయోధ్యలోని భూములను అక్రమంగా ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, స్థానిక ఎంపీ లల్లు సింగ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఓ లేఖ రాశారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ జాబితా ఇప్పుడు పూర్తిగా బహిరంగం అయిపోయింది. దీంతో సమాజక్‌వాదీ పార్టీ కూడా బీజేపీపై విమర్శలు చేస్తున్నది.

అయోధ్యలో బీజేపీ వర్కర్లు పాపాలకు పాల్పడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. బీజేపీ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్రమంగా కాలనీలు నిర్మిస్తున్నారని, ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై ఈ వ్యవహారం నెరపుతున్నారని ట్వీట్ చేసింది. ఈ చర్యలు రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర గండి  కొట్టినట్టేనని వివరించింది. ఈ ఉదంతాన్ని దర్యాప్తు చేయాలని పేర్కొంది. బాధ్యులు అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios