పశ్చిమ బెంగాల్‌లో మమత కోటను బద్ధలుకొట్టి కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసిన ఆ పార్టీ, ప్రచారంలోనూ దూసుకుపోతోంది.
పశ్చిమ బెంగాల్‌లో మమత కోటను బద్ధలుకొట్టి కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసిన ఆ పార్టీ, ప్రచారంలోనూ దూసుకుపోతోంది.
తాజాగా ఓటర్లను ఆకర్షించేందుకు గాను ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోను సిద్ధం విడుదల చేసింది. ‘సోనార్ బంగ్లా సంకల్ప్ పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కతాలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, పీఎం కిసాన్ అరియర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పే కమిషన్.. అంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీలను ప్రకటించింది.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏడో పే కమిషన్ వర్తింపజేస్తామని బీజేపీ హామీ ఇచ్చి ఉద్యోగ వర్గాలను టార్గెట్ చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది.
పీఎం- కిసాన్ అరియర్స్‌ను రూ.18వేల చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కోసం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఆమోదముద్ర వేస్తామని వెల్లడించింది.
గడిచిన 70 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో నివాసముంటున్న శరణార్థులకు పౌరసత్వం కల్పించడంతో పాటు ఏటా రూ.10వేలు చొప్పున ఐదేళ్ల పాటు నగదు బదిలీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
మహిళలకు కేజీ టు పీజీ ఉచిత విద్యతో పాటు రాష్ట్రంలో మూడు ఎయిమ్స్‌ల ఏర్పాటు కృషి చేస్తామని వెల్లడించింది. నోబెల్ బహుమతి తరహాలో ఠాగూర్ బహుమతి తీసుకొస్తాని.. బెంగాలీ భాష గుర్తింపుకు కృషి చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
