కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి పెరుగుతుంది. శనివారం కర్ణాటకలో ప్రచారం  నిర్వహించిన సోనియా గాంధీ చేసిన  కామెంట్స్‌పై బీజేపీ నాయకులతో పాటు పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి పెరుగుతుంది. శనివారం కర్ణాటకలో ప్రచారం నిర్వహించిన సోనియా గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో.. ‘‘కర్ణాటక ప్రతిష్టకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు’’ అని సోనియా గాంధీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. అయితే సోనియా గాంధీ చేసిన ఈ కామెంట్స్‌పై బీజేపీ నాయకులతో పాటు పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

నిషేధించబడిన పీఎఫ్‌ఐతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల లాభాల కోసం ఎస్‌డీపీఐ వంటి పార్టీలకు సమోధ్యను విస్తరించిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై విమర్శించారు. సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తీవ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారంటూ కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టిందని మండిపడ్డారు. ‘‘దయచేసి మిమ్మల్ని మీరు అపహస్యం చేసుకోవడం ఆపండి!’’ వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

Scroll to load tweet…

బీజేపీ ముంబై యూనిట్‌లోని ఐటీ, సోషల్ మీడియా సెల్ కో-కన్వీనర్ పల్లవి సీటీ స్పందిస్తూ.. సామ్నా పత్రికకు సంబంధించిన కొన్ని క్లిప్స్ షేర్ చేశారు. ‘‘మీ స్నేహితుడు సంజయ్ రౌత్ ఏమి రాశారో చూడండి..’’ అంటూ ఆ పేపర్ క్లిప్స్‌లోని కథనాల ఇంగ్లీష్‌ అనువాదాన్ని పోస్టు చేశారు. ‘‘మేము పీఎఫ్‌ఐ రాజకీయ విభాగం ఎస్‌డీపీఐ నుంచి మద్దతు తీసుకుంటాము. మేము మిషన్ 2047లో పీఎఫ్‌ఐకి సహాయం చేస్తాం. అందుకోసం.. ప్రభు హనుమంతుని భక్తులను బ్యాన్ చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాము. Ms కోసం మేము రిజర్వేషన్లు తీసుకోస్తాం. దీంతో మార్పిడి మాఫియాకు సాయం చేస్తాం. టెర్రరిస్టులు చనిపోయినప్పుడు మేము ఏడుస్తాం’’ అని అందులో ఉందంటూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వదిలిపెట్టిన చోటు నుంచి మొదలుపెట్టారని జర్నలిస్టు అలోక్ భట్ విమర్శించారు. సోనియా గాంధీ సార్వభౌమాధికారం అనే పదాన్ని కర్నాటక సందర్భంలో ఉపయోగించారని పేర్కొన్న అలోక్.. కర్ణాటక యూనియన్ ఆఫ్ ఇండియాలోని 28 రాష్ట్రాలు, 8 యూటీలలో ఒకటి అని గుర్తుచేశారు. సార్వభౌమత్వం, సార్వభౌమాధికారం అనే పదాన్ని చాలా లూజ్‌గా ఉపయోగించడమనే ప్రమాదకరమైన ధోరణి యాంటి ఇండియా అని అన్నారు. తప్పనిసరిగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలతో పోటీ పడాలని అన్నారు. 

Scroll to load tweet…


బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా స్పందిస్తూ.. సమాజంలో విద్వేషాలు, విభేదాలు విడదీయకుండా కాంగ్రెస్ చేసేదేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కర్ణాటక సార్వభౌమాధికారం కావాలా? అని మండిపడ్డారు. భారతదేశానికి సార్వభౌమాధికారమా? లేదా భారత భూభాగంలోని ఒక రాష్ట్రం కూడా సార్వభౌమాధికారమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశాన్ని మళ్లీ విభజించాలని చూస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘కర్ణాటక ‘‘సార్వభౌమాధికారం’’ అని మాట్లాడుతున్నారని.. కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు కొత్త దేశంగా అవతరించింది?. #BharatTodoYatra అంతా ఈ భారత మాతను ముక్కలు చేయడమేనా...?’’ అని @VairagiSpeaks ట్విట్టర్ యూజర్ విమర్శించారు. కాంగ్రెస్ విభజన ఎజెండాను తిప్పికొట్టాలని బీజేపీ అధికార ప్రతినిధులను కోరారు.