కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  బీజేపీ నేత అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది.

తనకు కరోనా సోకితే సీఎం మమత బెనర్జీని హత్తుకొంటానని అనుపమ్ హజ్రా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనపై కేసు నమోదైంది.హజ్రాకు జ్వరం వచ్చింది.దీంతో ఆయన కరోనా పరీక్షలు  నిర్వహించుకొంటే ఆయనకు కరోనా సోకిందని తేలింది.

ఆయన కోల్‌కతాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నాడు.ఇటీవలనే ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా పదవి లభించింది. 

హజ్రా వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు ఆయనపై  సిలిగురి పోలీస్ ప్టేషన్ లో కేసు నమోదు చేశారు.ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయనకు కరోనా సోకడం గమనార్హం. మమత బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే హజ్రాకు కరోనా వచ్చిందని టీఎంసీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.