Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేత ఉమాభారతికి కరోనా: హోం క్వారంటైన్‌లో సీనియర్ నేత

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతికి కరోనా సోకింది. తన  కరోనా పరీక్ష గురించి శనివారం నాడు రాత్రి ఉమాభారతి ట్విట్టర్ ద్వారా తెలిపారు.తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. అంతేకాదు హోం క్వారంటైన్ కు వెళ్లాలని కూడ ఆమె కోరారు.

BJP leader Uma Bharti tests positive for coronavirus
Author
New Delhi, First Published Sep 27, 2020, 10:17 AM IST


న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతికి కరోనా సోకింది. తన  కరోనా పరీక్ష గురించి శనివారం నాడు రాత్రి ఉమాభారతి ట్విట్టర్ ద్వారా తెలిపారు.తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. అంతేకాదు హోం క్వారంటైన్ కు వెళ్లాలని కూడ ఆమె కోరారు.

గత మూడు రోజులుగా తాను స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టుగా ఆమె చెప్పారు. దీంతో ఆమె పరీక్షలు నిర్వహించుకొంది.ఈ పరీక్ష్లల్లో కరోనా బారినపడినట్టుగా తేలింది. ఇటీవల కాలంలో ఆమె హిమాలయాలకు వెళ్లారు. ఆ సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె కరోనా బారినపడ్డారు.

హరిద్వార్, రిషికేష్ మధ్య ఉన్న వందేమాతం కుంజ్ లో తాను క్వారంటైన్ లో ఉన్నట్టుగా ఉమాభారతి తెలిపారు. నాలుగు రోజుల తర్వాత  మరోసారి కరోనా  పరీక్షలు నిర్వహించుకొంటానని ఉమాభారతి ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత కూడ ఇదే పరిస్థితి ఉంటే తాను  వైద్యులను సంప్రదిస్తానని ఉమా భారతి చెప్పారు.

దేశంలో ఆదివారం నాటికి 60 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయి. ఇందులో 9 లక్షల 56 వేల 402 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios