గత 75 ఏళ్లుగా ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని, వాస్తవానికి సెక్యులర్ అనే పదం ఈ దేశానికి, ముస్లింలకు అత్యంత హాని కలిగించిందని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని ప్రేమించని ముస్లిం నిజమైన ముస్లిం కాలేడని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. APJ అబ్దుల్ కలాం ముస్లింలకు ఆదర్శం, ఒవైసీ కాదు. కార్చనలో జరిగిన బహిరంగ సభలో హుస్సేన్ ప్రసంగిస్తూ.. “ బీజేపీ వారు భారత్ మాతాకీ జై అని చెప్పినప్పుడు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. తల్లి కాకపోతే మనం పుట్టిన మట్టిని ఏమని పిలవాలని అన్నారు.
గత 75 ఏళ్లుగా ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో లౌకికవాదం దుకాణం ఇప్పుడు మూతపడబోతోందని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. ఏదైనా పదం వల్ల ఈ దేశానికి, ముస్లింలకు ఎక్కువ నష్టం జరిగిందంటే.. అది సెక్యులర్ అనే పదమేనని ఆయన అన్నారు. ఈ పదాన్ని (సెక్యులర్) ప్రతిపక్షాలు ఎప్పుడు ఫెవికాల్ లా అతికించుకుంటున్నారని ఆరోపించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్యతను ప్రదర్శించేందుకు జూన్ 23న జరగనున్న ప్రతిపక్షాల సమావేశంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కాలినడకన నడుస్తున్నాడు. నిరుపేదలు రోజువారీ కూలీ కోసం కాలినడకన వెళుతున్నారు. మహాత్మా గాంధీ దండి మార్చ్ కోసం పదవిని తిరస్కరించారు. మరికొందరు ఆ పదవి కోసం కాలినడకన ప్రయాణిస్తున్నారు. రాహుల్ ఏ ప్రయోజనం కోసం నడిచారో తెలియజేయాలని అన్నారు.
కరోనా కాలాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ లేకుంటే, కాంగ్రెస్ నాయకులకు వ్యాక్సిన్‌లో కమీషన్ వచ్చేదని, సరైనా సమయంలో వ్యాక్సిన్స్ అందక అందరం చనిపోయేవారమని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు షానవాజ్ హుస్సేన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది, అలహాబాద్ లోక్‌సభ ఎంపీ రీటా బహుగుణ జోషి, కర్చన ఎమ్మెల్యే పీయూష్ రంజన్ నిషాద్, తదితరులు పాల్గొన్నారు.
