జమ్ము: జమ్మూ కాశ్మీరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని సాయుధులు బిజెపి రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్ ను, ఆయన సోదరుడిని కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. 

ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారా లేదంటే నేరస్థులు ఈ చర్యకు దిగారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బిజెపి జమ్మూ కాశ్మీర్ కార్యదర్శి అనిల్ పరిహార్ ను, అతని సోదరుడిని ఉగ్రవాదులు కిస్త్వర్ లో కాల్చి చంపారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు 

గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించారు.