బెంగాల్ సీఎం మమత బెనర్జీ  మణిపూర్  లో హింసపై  ట్విట్టర్ వేదికగా  చేసిన విమర్శలకు బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు.

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు.మణిపూర్ హింసపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. మణిపూర్ ఘటనను హృదయ విదారకరమైందిగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి మాటలు రావడం లేదని మమత బెనర్జీ చెప్పారు. ఈ వీడియో చూసి తన గుండె పగిలిందన్నారు.మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న హింస మాటల్లో చెప్పలేకపోతున్నట్టుగా సీఎం పేర్కొన్నారు.

అమానవీయమైన ఈ ఘటనను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని మమత బెనర్జీ పేర్కొన్నారు. అంతేకాదు బాధితులకు న్యాయం చేసేందుకు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Scroll to load tweet…


మమత బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలకు బెంగాల్ బీజేపీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. బెంగాల్ రాష్ట్రంలో గ్రామపంచాయితీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. హౌరా లోని పంచ్ లా ప్రాంతంలో ఓ మహిళలను నగ్నంగా నిలబెట్టి దాడి చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు

టీఎంసీ అభ్యర్థి హేమంత్ రాయ్ ఇతరులతో కలిసి మహిళపై దాడి చేసి నగ్నంగా ఊరేగించారని ఆయన ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై కేంద్రీకరించాలని ఆయన సీఎం మమత బెనర్జీకి సూచించారు.