రాజ్యసభకు రఘురామ్ రాజన్‌ను పంపే యోచనలో కాంగ్రెస్.. విభజన రాజకీయమేనన్న బీజేపీ నేత అమిత్ మాల్వియా
రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపడంపై చర్చలు జరుగుతున్న సమయంలో, రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీపై బిజెపి దాడి చేసింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు పంపే అవకాశాలు వున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపడంపై చర్చలు జరుగుతున్న సమయంలో, రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీపై బిజెపి దాడి చేసింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ట్వీట్‌పై ఆయన స్పందించారు. 2013 సెప్టెంబర్ 2న రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచికపై రఘురామ్ రాజన్ నేతృత్వంలోని కమిటీ .. కర్ణాటక వాటాను 4.13 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గించాలని సిఫారసు చేసిందని మాల్వియా గుర్తుచేశారు. ఇదంతా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జరిగిందని.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందని అమిత్ చురకలంటించారు.
ఇది విభజన రాజకీయం తప్పించి మరొకటి కాదు.. రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. దానికంటే ముందు కర్ణాటక సంక్షేమాన్ని దెబ్బతీసిన వ్యక్తిని ఎందుకు గౌరవించాలనుకుంటున్నారో కాంగ్రెస్ వివరిస్తుందా అని అమిత్ మాల్వియా ప్రశ్నించారు.