NAGPUR: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన శివసేన చీలిక అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్ థాక్రే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూలై 31న న్యాయస్థానం విచారణ జరపనుంది. శివసేనలో తిరుగుబాటు తర్వాత 2022లో ఉద్ధవ్ థాక్రే అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల గుర్తు ఉద్ధవ్ చేతి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Shiv Sena (UBT) chief Uddhav Thackeray: ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోందనీ, యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలపై పైకి తీసుకువస్తున్నదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇతర పార్టీలలో చీలికలను సృష్టిస్తోందనీ, ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే సోమవారం ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను లేవనెత్తుతోందని ఆరోపించారు.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. థాక్రేతో షిండే తెగతెంపులు చేసుకోవడంతో గత ఏడాది జూన్ లో ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రధాని తమదని చెప్పుకుంటున్న బీజేపీ ఇతర పార్టీలను ఎందుకు చీల్చాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ''మీరు శివసేనను దొంగిలిస్తున్నారు, మీరు ఎన్సీపీని కూడా దొంగిలించారు, రేపు మీరు ఇంకేదైనా దొంగిలిస్తారు. దేశానికి చెందిన వాటిని అమ్మేసి ఇతరులకు దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని'' ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ముందు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. వారు అధికార దాహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో ఏమీ లేని బీజేపీని శివసేన తన భుజస్కంధాలపై మోసుకుని రాష్ట్రంలో పునాదిని విస్తరించేందుకు దోహదపడిందని థాక్రే పేర్కొన్నారు. ''మమ్మల్ని రాజకీయాల్లో అంతమొందించాలని చూస్తున్నారు, ఇది మీ హిందుత్వం. 25 నుంచి 30 ఏళ్లుగా మీతోనే ఉన్నామని, ఇప్పుడు మీరు జీరోగా ఉన్నప్పుడు మీతో ఉన్న శివసేనను అంతమొందించాలని యోచిస్తున్నారని'' మాజీ కాషాయ మిత్రపక్షంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందని విమర్శించారు. ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను అయోమయానికి గురిచేశారనీ, ఎన్నికలు ముగిశాక ఆ అంశాన్ని పక్కన పెట్టారని మాజీ సీఎం మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీకి ఒరిగేదేమీ లేదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నామనీ, కానీ దానిని తీసుకువచ్చే దమ్ము ప్రభుత్వానికి లేదని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
ఇదిలావుండగా, మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన శివసేన చీలిక అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్ థాక్రే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూలై 31న న్యాయస్థానం విచారణ జరపనుంది. శివసేనలో తిరుగుబాటు తర్వాత 2022లో ఉద్ధవ్ థాక్రే అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల గుర్తు ఉద్ధవ్ చేతి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
