మరో సారి ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల బరిలో బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఎందుకంటే ?

ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఆ పార్టీకి చెందిన  శిఖా రాయ్, సోనీ పాండే ఈ పదవుల కోసం బరిలో నిలవనున్నారు. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

BJP in Delhi Mayor and Deputy Mayor election again.. Now because of election again?..ISR

ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. మేయర్ పదవికి శిఖా రాయ్, డిప్యూటీ మేయర్ పదవికి సోనీ పాండే పోటీ చేయనున్నారు. వారిద్దరూ నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా ఏప్రిల్ 26న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎన్నికకు ఏప్రిల్ 26ను తేదీగా ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆమోదించినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

ఇక మాఫియా ఎవరినీ భయపెట్టదు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ మార్చి 31న మేయర్ పదవిలో 38 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30లోగా కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీల మధ్య హోరాహోరీ నాలుగో ప్రయత్నంలో ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ మేయర్ గా ఎన్నికయయారు. 

విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దీంతో ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 కైవసం చేసుకోగా, బీజేపీకి 104 వచ్చాయి. కాగా.. ప్రస్తుతం కూడా సభలో తగిన సంఖ్యాబలం లేకపోయినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు శిఖా రాయ్, సోనీ పాండేలను పోటీకి దింపాలని నామినేషన్లకు చివరి రోజైన మంగళవారమే బీజేపీ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఎవరూ అడ్డుకోలేరు - యడియూరప్ప

ఇందులో శిఖా రాయ్ గ్రేటర్ కైలాష్-1 వార్డు నుండి కౌన్సిలర్‌గా ఉన్నారు, సోనీ పాండే పౌరసత్వ సంస్థలో ఈశాన్య ఢిల్లీలోని సోనియా విహార్ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మేజారిటీ ఉన్నందున, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ గతంలో భావించినా.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సిట్టింగ్ మేయర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ ఆలే మహ్మద్ ఇక్బాల్‌లను ఎన్నికల కోసం రంగంలోకి దించింది.

గాలి జనార్ధన రెడ్డి దంపతుల వద్ద 84 కిలోల బంగారం, వజ్రాలు.. 437 కిలో వెండి -ఎన్నికల నామినేషన్ లో ఆస్తుల వెల్లడి

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక సంవత్సరం పదవీకాలం ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ఈ పోస్ట్‌కి రొటేషన్ ప్రాతిపదికన ఐదు ఒకే-సంవత్సరాల కాలాలు ఉన్నాయి, మొదటి సంవత్సరం మహిళలకు, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరీకి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios