Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో మార్చికల్లా బీజేపీ ప్రభుత్వం.. కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలి: కేంద్ర మంత్రి సంచలనం

మహారాష్ట్రలో వచ్చే ఏడాది మార్చి కల్లా బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడమా? కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? అంటూ కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచాల్సి ఉంటుందని అన్నారు. తన మనసులో చాలా విషయాలు ఉన్నాయని, కానీ, ఇప్పుడు బయట పెట్టవద్దని తెలిపారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మార్పు జరగనున్నట్టు ఆయన చెప్పారు. 
 

bjp govt will form by march in maharashtra says union minister narayan rane
Author
Mumbai, First Published Nov 26, 2021, 7:55 PM IST

ముంబయి: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే(Naranay Rane) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చికల్లా మహారాష్ట్ర(Maharashtra)లో BJP ప్రభుత్వం వస్తుందని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని కూల్చడమా? ఏర్పాటు చేయడమా? అని మాట్లాడుతూ కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో మహావికాస్ అఘాదీ (Shivsena, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి)ఉన్నది. సీఎంగా Uddhav Thackeray బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

\ఉద్ధవ్ ఠాక్రేకు, నారాయణ్ రాణేకు మధ్య కొంత కాలం క్రితం వాగ్యుద్ధం మళ్లీ తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన మాటలో మాటగా చాలా సాధారణంగా మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం పడిపోతుందని, మార్చి కల్లా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కొందరు విలేకరులకు సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమాధానం విలేకరులు సైతం ఖంగుతిన్నారు. క్లారిటీ కోసం మళ్లీ మళ్లీ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన అదే సమాధానం చెప్పారు.

Also Read: చెంప దెబ్బ రాజకీయం: నారాయణ రాణే అరెస్ట్‌... బీజేపీ-శివసేనల మధ్య మాటల యుద్ధం

వచ్చే మార్చిలోగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మార్పు కనిపిస్తుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. దీంతో ఎప్పటికల్లా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు? అంటూ మళ్లీ ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నది కదా.. మార్చిలోపే బీజేపీ ప్రభుత్వం వస్తుందా? అని అడిగారు. దీనికి ఆయన ‘మరి మీరు చెప్పండి ఎప్పటికల్లా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందో?’ అంటూ తిరిగి ప్రశ్న సంధించారు. తమ కంటే కేంద్రమంత్రికే ఈ విషయం ఎక్కువ తెలిసి ఉంటుందని విలేకరులు అన్నారు.

అనంతరం ఆయన మళ్లీ తన వ్యాఖ్యలకు సమర్థనగా మాట్లాడారు. కొన్ని విషయాలు మనసులోనే ఉంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకుంటే ఇప్పుడు బయట పెట్టకూడని విషయాలూ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టడమా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? ఇవన్నీ రహస్యంగా ఉంచాల్సిన విషయాలు అని వివరించారు.

మహారాష్ట్రలో కీలక నేతగా ఎదిగిన నారాయణ్ రాణే తొలుత శివసేనలోనే ఉన్నారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన చెడిన తర్వాత పార్టీ మారారు. 17 ఏళ్ల క్రితం మొదలైన ఆ ఘర్షణలు ఇప్పటికీ బయటకు వస్తుంటాయి. వారిద్దరి మధ్య ఇప్పటికీ వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. భారత దేశం స్వాతంత్ర్యం పొందిన సంవత్సరమూ తెలియకపోతే అక్కడే ఉన్న ఒకరిని అడిగి తెలుసుకున్నారని, అదే స్టేజీపై తాను ఉంటే ఉద్ధవ్ ఠాక్రే చెంప చెల్లుమనిపించే వాడిని అని ఇటీవలే బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆయనపై కేసు నమోదైంది. 20ఏళ్ల తొలిసారి ఓ కేంద్ర మంత్రి పోలీసు కస్టడీలోకి వెళ్లాల్స వచ్చింది.

Also Read: నన్ను విమర్శించిన వారికి ఉన్నత పదవులు... ఏం జరిగినా యాత్ర ఆగదు: నారాయణ్ రాణే

గత హయాంలో బీజేపీ, శివసేనలే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నాయి. కానీ, సీఎం పీఠంపై పేచీతో గత ఎన్నికల తర్వాత శివసేన.. బీజేపీకి దూరమైంది. అయితే, అంతలోపే కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా గవర్నర్ నివాసంలో ప్రమాణ స్వీకారం కూడా చేపట్టారు. కానీ, సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలతో వెంటనే బలపరీక్ష చేయాలని ఆదేశించడంతో సీన్ మారింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మళ్లీ శరద్ పవార్ చెంతకు చేరడం, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలను ఒక తాటి మీదకు తెచ్చి మహావికాస్ అఘాదీ కూటమిని శరద్ పవార్ అల్లి సంచలనం సృష్టించారు. అప్పుడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, ప్రధాన మంత్రి ఇటీవలే చేపట్టిన కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనలో మహారాష్ట్ర నుంచి నారాయణ్ రాణే బెర్తు కన్ఫామ్ చేసుకున్నారు. ఆయన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios