సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ జీఎస్టీ బాదుడు విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. శ్రీ కృష్ణుడికి ఇష్టమైన పాల పదార్థాలపై జీఎస్టీ విధించి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ట్వీట్ చేశారు.సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ జీఎస్టీ బాదుడు విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. శ్రీ కృష్ణుడికి ఇష్టమైన పాల పదార్థాలపై జీఎస్టీ విధించి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ట్వీట్ చేశారు. 

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలపై కూడా జీఎస్టీ వేసి శ్రీ కృష్ణుడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కేంద్రాన్ని విమర్శించారు. 

ప్యాక్ చేసిన పెరుగు, లస్సీ, పనీర్, బటర్ మిల్క్‌లపై ఐదు శాతం జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలిపింది. జులై 18వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు వివరించింది. దీనికి తోడు ప్యాక్డ్, లేబల్డ్ రైస్, ఫ్లోర్, గోధుమలపైనా జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాల నేపథ్యంలోనే అఖిలేశ్ యాదవ్ విమర్శలు సంధించారు.

Scroll to load tweet…

జీఎస్టీ బాదుడుపై అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్‌లో తన అసహనాన్ని వ్యక్తపరిచారు. జై శ్రీ కృష్ణ అంటూ ఓ ట్వీట్ మొదలు పెట్టారు. మరో నెల రోజుల్లో జన్మాష్టమి రానుందని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం కృష్ణుడి భక్తుల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. పాలు, పెరుగు, సల్లాపై జీఎస్టీ విధించడం తమను బాధించిందని వివరించారు. ఇంతటితో ఆగకుండా శ్రీ కృష్ణుడి చుట్టూ అల్లుకున్న సామెతలపైనా కూడా జీఎస్టీ విధిస్తారా? అని అమాయక భక్తులు తీవ్ర నిర్వేదంలోకి జారిపోయారని పేర్కొన్నారు.

ఈ నెల 18వ తేదీ నుంచి పలు సరుకులపై జీఎస్టీ బాదుడు అమల్లోకి వచ్చింది. ఏ వస్తువులపై ఏ మొత్తంలో జీఎస్టీ పడుతున్నదో ఓ సారి చూద్దాం.

వీటి పై 5% GST 
పెరుగు, లస్సీ, పనీర్, తేనె, తృణధాన్యాలు, మాంసం, చేపలు, ఆసుపత్రిలో రూం రెంట్ రూ. 5000 పై ఉంటే 5% GST వర్తిస్తుంది

12% GST 
హోటల్ గదులపై రోజుకు రూ. 1,000 కంటే తక్కువ రెంట్ 
మ్యాప్, అట్లాస్ అండ్ గ్లోబ్ పై
నేల సంబంధిత ఉత్పత్తులపై ఇప్పుడు 5%

18% GST

చెక్ బుక్ జారీపై బ్యాంకులు విధించే ఛార్జీలపై
టెట్రా ప్యాక్‌పై ఇప్పుడు 12%
LED లైట్లు, LED ల్యాంప్‌లపై ప్రింటింగ్/వ్రైటింగ్ లేదా ఇంక్ డ్రాయింగ్ పై ప్రస్తుతం 12%
బ్లేడ్లు, కత్తులు, పెన్సిల్ షార్పెనర్లు, స్పూన్లు, ఫోర్క్డ్ స్పూన్లు, స్కిమ్మర్లు మొదలైన వాటిపై ఇప్పుడు 12%
పిండి మిల్లు, పప్పు మెషీన్ పై ఇప్పుడు 5%
ధాన్యం సార్టింగ్ మెషిన్స్, పాల మెషిన్లు, పండ్ల-వ్యవసాయ ఉత్పత్తుల సార్టింగ్ మెషిన్స్, వాటర్ పంపులు, సైకిల్ పంపులు, సర్క్యూట్ బోర్డులు పై ఇప్పుడు 5%