Asianet News TeluguAsianet News Telugu

మోడీ హవా.. బీజేపీకి పెరిగిన విరాళాలు.. ఏ పార్టీకి ఎంతెంత వస్తాయి..?

ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికార బీజేపీ రూ. 614.53 కోట్లను విరాళాలు పొందగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సేకరించిన నిధుల కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం..కాంగ్రెస్ రూ. 95.46 కోట్ల నిధులను పొందిగా.. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ. 43 లక్షలు విరాళంగా అందుకుంది. కేరళలో ప్రభుత్వంలో ఉన్న సిపిఎం ₹ 10.05 కోట్ల నిధులు అందుకుంది. 

BJP Got rs 614.53 Crore As Contributions Last Year, Congress 95.46 Crores
Author
First Published Nov 30, 2022, 1:06 PM IST

ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఈ ఏడాది (2021-22) భారీగా విరాళాల వర్షం కురిసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 614.53 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ సేకరించిన మొత్తం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో కాంగ్రెస్ పార్టీకి రూ.95.46 కోట్ల విరాళాలు అందాయి. డేటా ప్రకారం.. సీపీఐ(ఎం) రూ.10.05 కోట్ల విరాళాలు అందుకుంది.  ఇది కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ , పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)2021-22 మధ్యకాలంలో రూ.44.54 కోట్లు అందుకుంది. 

మమతా బెనర్జీ పార్టీకి కేవలం రూ.43 లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చారా?

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఎన్నికల సంఘం గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ చాలా కాలంగా అధికారంలో ఉంది. అలాంటి పార్టీకి కేవలం రూ.43 లక్షల విరాళమా? అనే ప్రశ్న తల్లెత్తున్నాయి. ఈఏడాది అన్ని పార్టీల విరాళాలు పెరగగా.. మమతా బెనర్జీ పార్టీకి కేవలం రూ.43 లక్షల విరాళాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది బీజేపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. కాంగ్రెస్ విరాళాలు కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ల విరాళాలు పెరిగాయి

2020-21లో బీజేపీకి రూ.477.7 కోట్ల విరాళాలు అందగా, ఈ ఏడాది విరాళాలు రూ.614.5 కోట్లకు పెరిగిపోయాయి. ఈ ఏడాది బీజేపీ విరాళాలు  దాదాపు 28.7 శాతానికి పెరిగాయి. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే గతేడాదితో పోలిస్తే ఈసారి విరాళాలు 28.1 శాతం పెరిగి రూ.95.5 కోట్ల విరాళాలు అందుకుంది. గత ఏడాది కాంగ్రెస్‌కు రూ.74.7 కోట్లు విరాళాలు అందాయి.  

ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. విరాళాలు స్వీకరించడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మూడవ స్థానంలో నిలిచింది. 2021-2022లో ఎన్‌సీపీకి రూ. 57.9 కోట్లు రాగా.. గత ఏడాది 26.2 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఎన్సీపీకి  120 శాతం విరాళాలు పొందాయి. సీపీఐ-ఎంకు 10 కోట్లు విరాళాలు అందాయని, అయితే గతేడాది కంటే 21.7 శాతం తక్కువ విరాళాలు అందుకున్నాయి. 

ఎవరికి ఎంత విరాళం వచ్చాయి ? జాబితా చూడండి

బీజేపీ - రూ.614.53 కోట్లు
కాంగ్రెస్ - రూ.95.46 కోట్లు
ఆప్ - 44.45 కోట్లు
సీపీఐ(ఎం) - రూ.10.05 కోట్లు
తృణమూల్ కాంగ్రెస్ - రూ.43 లక్షలు

Follow Us:
Download App:
  • android
  • ios