Asianet News TeluguAsianet News Telugu

సొంత ఇలాఖాలో అమిత్ షాకు ఎదురు దెబ్బ: అత్తగారి ఊరిలో బీజేపీ స్మాష్

కొల్హాపూర్ ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ గా చేస్తానన్న అమిత్ షా తన అత్తగారి జిల్లాలోనే ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కొల్హాపూర్ జిల్లాను బీజేపీ ముక్త్ జిల్లాగా చేసాయి అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.  

bjp gets rooted out in amit shahs mother in laws district
Author
Kolhapur, First Published Jan 3, 2020, 1:40 PM IST

కొల్హాపూర్: మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడప్పుడే వార్తలకు కేంద్ర బిందువు అవడం ఆగేలా లేదు. తొలుత కర్ణాటక డ్రామాను మించిన డ్రామాను కనబరిచి అత్యధిక స్థానాలు గెల్చిన బీజేపీకి షాక్ ఇస్తూ... శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 

ఆతరువాత కూడా బీజేపీ అసంతృప్త నేతలను దువ్వుతూ మహా వికాస్ అఘాడి ప్రభుత్వం రోజుకో కొత్త విషయంతో వార్తల్లో నిలుస్తుంది. పంకజ ముండే, ఎకనాథ్ ఖడ్సేల వ్యవహారం కొనసాగుతుండగానే తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక పరిణామం ఇప్పుడు బీజేపీ వర్గాలకు, ముఖ్యంగా మిత్ షాకు ఒక మింగుడు పాడనీ అంశంగా తయారయ్యింది. 

నిన్న జరిగిన కొల్హాపూర్, నాసిక్ జిల్లాపరిషత్ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమి బీజేపీకి షాక్ ఇస్తూ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. కొల్హాపూర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, డిప్యూటీ చైర్మన్ పదవిని ఎన్సీపీ కైవసం చేసుకుంది.

Also read; కేసీఆర్ తో కటీఫ్: అమిత్ షా గురి తెలంగాణపైనే, వ్యూహం ఇదే...

ఇక నాసిక్ లో చైర్మన్ పదవిని శివసేన కైవసం చేసుకోగా, ఎన్సీపీ డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకొంది. 

అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారాన్ని చేపట్టడానికి మూడు పార్టీలు కలిసి తమ బలాన్ని ఉపయోగించినట్టే ఈ జిల్లాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను కైవసం చేసుకోవడానికి ఇదే తరహాలో తమ ఉమ్మడి బలాన్ని ఉపయోగించి సక్సెస్ సాధించాయి. 

కొల్హాపూర్ లో ఓటమి బీజేపీకి ప్రధానంగా పడ్డ దెబ్బగా చెప్పవచ్చు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్ ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన గతసారి పూణే జిల్లాలోని కోత్రుడ్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లాలో ఓడిపోవడం ఇక్కడ బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. 

కొల్హాపూర్ ఓటమి కేవలం ఆయనకు మాత్రమే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ గా చేస్తానన్న అమిత్ షా తన అత్తగారి జిల్లాలోనే ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కొల్హాపూర్ జిల్లాను బీజేపీ ముక్త్ జిల్లాగా చేసాయి అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. 

Also read: దుర్యోధన, దుశ్శాసన: బీజేపీ నేతలపై యశ్వంత్ సిన్హా మహాభారతం పంచ్

అమితాషా భార్య సోనాల్ షా కొల్హాపూర్ లోనే జన్మించారు. ఆమె విద్యాభ్యాసం కూడా కొల్హాపూర్ లోని ప్రిన్సెస్ పద్మరాజే బాలికల ఉన్నత పాఠశాలలోనే జరిగింది. ఇప్పుడు కొల్హాపూర్ అల్లుడైన అమిత్ షా తన అత్తగారి జిల్లానే పూర్తిగా కోల్పోవాల్సి రావడం నిజంగా ఆయనకు ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. 

కొల్హాపూర్ జిల్లాలో ఇప్పుడు ఒక్కడంటే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మునిసిపల్ చైర్మన్ కానీ, జిల్లాపరిషత్ చైర్మన్ స్థానాల్లో కానీ బీజేపీ అధికారంలో లేకపోవడం మాత్రం నిజంగా పార్టీగా బీజేపీకి ఒక ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో వచ్చిన వరదల్లో కొల్హాపూర్ జిల్లా పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు రైతులు నష్టపరిహారం కోసం డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం సరిగా స్పందించలేదనే...అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి చెందినట్టు మనకు అర్థమవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios